Raksha Bandhan 2024 : రాఖీ వేళ.. కవితపై కేటీఆర్ భావోద్వేగ ట్వీట్..

రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి కవితను గుర్తుచేసుకుంటూ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఇవాళ నువ్వు నాకు రాఖీ కట్టలేని పరిస్థితి.. కానీ..

Raksha Bandhan 2024 : రాఖీ వేళ.. కవితపై కేటీఆర్ భావోద్వేగ ట్వీట్..

KTR and Kavitha

Updated On : August 19, 2024 / 12:06 PM IST

KTR : రాఖీ పౌర్ణమి వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కడుతూ తమ ప్రేమను చాటుకుంటున్నారు. ప్రతీయేటా రాఖీ పౌర్ణమి రోజున బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కు రాఖీ కడుతూ వస్తున్నాయి. అయితే, ఈసారి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. గత ఐదు నెలలకు పైగా ఆమె జైల్లోనే ఉంటున్నారు. పలు సార్లు బెయిల్ కు ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ప్రయత్నించినా బెయిల్ మంజూరు కాలేదు. ఈ క్రమంలో వారంలో ఒకటిరెండు సార్లు కవితతో కేటీఆర్ జైల్లో ములాఖత్ అవుతూ వస్తున్నారు.

Also Read : రాఖీ వేళ.. చిన్నతనంలో రాహుల్ గాంధీతో కలిసిఉన్న ఫొటోలను షేర్ చేసిన ప్రియాంక గాంధీ

రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి కవితను గుర్తుచేసుకుంటూ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఇవాళ నువ్వు నాకు రాఖీ కట్టలేని పరిస్థితి.. అయినప్పటికీ, ఎలాంటి కష్టంలో అయినా నీ వెంట ఉంటా’ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.