రాఖీ వేళ.. చిన్నతనంలో రాహుల్ గాంధీతో కలిసిఉన్న ఫొటోలను షేర్ చేసిన ప్రియాంక గాంధీ

రక్షా బంధన్ సందర్భంగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికర ఫొటోను షేర్ చేశారు. చిన్నతనంలో సోదరుడు రాహుల్ గాంధీతో

రాఖీ వేళ.. చిన్నతనంలో రాహుల్ గాంధీతో కలిసిఉన్న ఫొటోలను షేర్ చేసిన ప్రియాంక గాంధీ

Rahul Gandhi and Priyanka Gandhi

Updated On : August 19, 2024 / 11:41 AM IST

Raksha Bandhan 2024 : రాఖీ పౌర్ణమి వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కడుతూ ప్రేమను చాటుకుంటున్నారు. రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరీమణుల మధ్య విడదీయరాని ప్రేమ మరియు అనురాగాల పండుగ రక్షాబంధన్. ఈ పండుగ సందర్భంగా దేశవాసులందరికీ శుభాకాంక్షలు. ఈ రక్షణ తంతు ఎల్లప్పుడూ మీ పవిత్ర సంబంధాన్ని బలంగా ఉంచుతుంది.. అంటూ రాహుల్ తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు.

Also Read : Pawan Kalyan : అక్కచెల్లెమ్మ‌ల అనురాగానికి ఏమిస్తే రుణం తీరుతుంది.. రాఖీ శుభాకాంక్ష‌లు తెలిపిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

రక్షా బంధన్ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికర ఫొటోను షేర్ చేశారు. చిన్నతనంలో సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ఆడుకుంటున్న ఫొటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె రాఖీ పౌర్ణమి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సోదరుడు మరియు సోదరి మధ్య సంబంధం ఒక పూలచెట్టు లాంటిది.. దీనిలో విభిన్న రంగుల జ్ఞాపకాలు, కలయిక యొక్క కథలు.. స్నేహాన్ని మరింతగా పెంచుకోవాలనే సంకల్పం, గౌరవం, ప్రేమ, పరస్పర అవగాహన పునాదిపై వర్ధిల్లుతాయి. సోదరులు, సోదరీమణులు పోరాటంలో సహచరుల జ్ఞాపకాలు కూడా ఉంటాయి.. మీ అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. అంటూ ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ ఫోస్టుకు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మీ అన్నాచెల్లెళ్ల బంధం కలకాలం సంతోషంగా ఉండాలంటూ దీవిస్తున్నారు.