ఒక్కొక్కరు 30-40 మంది ఎమ్మెల్యేలను కూడగట్టే పనిలో ఉన్నారు- కాంగ్రెస్ మంత్రులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ఒక అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ. కాంగ్రెస్ కూడా అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ. ఆ రెండింటికి కరెక్ట్ గా జోడీ కలుస్తుంది..

ఒక్కొక్కరు 30-40 మంది ఎమ్మెల్యేలను కూడగట్టే పనిలో ఉన్నారు- కాంగ్రెస్ మంత్రులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కాంగ్రెస్ మంత్రులపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కావాలని కాంగ్రెస్ మంత్రులు కలలు కంటున్నారని కామెంట్ చేశారు బండి సంజయ్. దీని కోసం ఎవరికి వారే సంఖ్యా బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒక్కో మంత్రి తాము సొంతంగా 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలను కూడగట్టే పనిలో ఉన్నారని సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ను చేర్చుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్ కే ఉందన్నారు.

బీఆర్ఎస్ ను చేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. కాంగ్రెస్ పార్టీకే ఆ అవసరం ఉంది. ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీలో చాలామంది కలలు కంటున్నారు. ఎవరికి వారు ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలని సొంతంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాబట్టే బీఆర్ఎస్ పార్టీలోని వారిని కొనుక్కుంటున్నారు. కాంగ్రెస్ లో ఉన్న చాలా మంది నెక్ట్స్ ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్లు మా పార్టీలో చేరితే మా ప్రభుత్వం వస్తుందా? మాకు ఏం అవసరం? బీఆర్ఎస్ ఒక అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ. కాంగ్రెస్ కూడా అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ. ఆ రెండింటికి కరెక్ట్ గా జోడీ కలుస్తుంది” అని బండి సంజయ్ అన్నారు.