Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న యువరైతు

Dragon Fruit : ఒక్కసారి నాటితే 25 నుండి 30 ఏళ్లు దిగుబడి వచ్చే పంట డ్రాగన్ ఫ్రూట్. ఇతర పంటల సాగుతో పోల్చితే శ్రమ తక్కువ ఉండటం.. పెద్దగా చీడపీడల బెడద లేకపోవడం ఈ పంట సాగుకు కలిసి వస్తోంది.

Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న యువరైతు

B.Tech Candidate Cultivating Dragon Fruit

Updated On : August 23, 2024 / 2:23 PM IST

Dragon Fruit : సంప్రదాయ పంటల స్థానంలో పండ్లతోటల సాగుకు మొగ్గుచూపుతున్నారు రైతులు. తక్కువ శ్రమ.. దీర్ఘకాలిక దిగుబడులు వస్తుండటంతో చాలా మంది యువరైతులు ఉద్యాన పంటలసాగునే ఎంచుకుంటున్నారు. ఈ కోవలోనే విజయనగరం జిల్లాకు చెందిన ఓ యువరైతు  ప్రయోగాత్మకంగా రెండున్నర ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగుచేస్తూ.. మంచి ఆదాయం పొందుతున్నారు.

Read Also : Dragon Fruit Farming : ట్రెల్లీస్ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు

మారిన ఆహార అలవాట్లతో, తెలుగు రాష్ట్రాల్లో  కొత్త పంటలు, వినూత్న పండ్ల తోటలు విస్తరిస్తున్నాయి. వినియోగదారుల ఆసక్తి, మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ ఉన్న పంటలనే  పండిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ సాగును ఇప్పటికే చాలామంది సాగుచేసి మంచి ఆదాయం పొందుతున్నారు. ఇది చూసి విజయనగరం జిల్లా, గరివిడి మండలం, చుక్కవలస గ్రామానికి చెందిన రైతు వెంకటరమణ , ఏడాదిన్నర క్రితం రెండున్నర ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను నాటారు.

మొత్తం 900 సింమెంట్ స్థంబాలను ఏర్పాటు చేసి, పైన రింగ్ లను అమర్చాడు. ఒక్కో మొక్క ధర రూ.70 వెచ్చించి  కొనుగోలు చేశారు.  ఒక్కో స్థంబానికి 4 మొక్కలు చొప్పునా, మొత్తం 3 వేల 600 మొక్కలు నాటారు. డ్రిప్ ద్వారా నీరు అందిస్తున్నారు. నాటిన ఏడాది నుంచే దిగుబడులు ప్రారంభమయ్యాయి. వచ్చిన దిగుబడిని స్థానికంగా అమ్ముతూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.

ఒక్కసారి నాటితే 25 నుండి 30 ఏళ్లు దిగుబడి వచ్చే పంట డ్రాగన్ ఫ్రూట్. ఇతర పంటల సాగుతో పోల్చితే శ్రమ తక్కువ ఉండటం.. పెద్దగా చీడపీడల బెడద లేకపోవడం ఈ పంట సాగుకు కలిసి వస్తోంది. బహిరంగ మార్కెట్లో కిలో పండ్లు 100 నుండి 150 వరకు పలుకుతుండటంతో.. మంచి లాభాలు వస్తున్నాయంటున్నారు రైతు.

Read Also : Cococa Plantation : కొబ్బరి, పామాయిల్ తోటల్లో అంతర పంటగా కోకో