Dragon Fruit Farming : ట్రెల్లీస్ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు
డ్రాగన్ ఫ్రూట్ రైతులకు మేలు చేసే పంట. సాగులో పెద్దగా పని ఉండదు. మందులు వేయాల్సిన పనిలేదు. నీటి అవసరం చాలా తక్కువే. సేంద్రియ పద్ధతిలో పంట పండించవచ్చు. సులభ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు.

Dragon Fruit Farming
Dragon Fruit Farming : డ్రాగన్ ఫ్రూట్ ఔషధ గుణాలున్న పండు. ఇందులో వ్యాధి నిరోధకశక్తి అధికంగా ఉండటంతో కరోనా సమయం నుండి వీటి వినియోగం పెరిగింది. దీన్నే ఆసరాగా చేసుకొని చాలా మంది రైతులు ఈ పంటసాగుచేసి లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ కోవలోనే కడప జిల్లాకు చెందిన ఓ యువరైతు ఎకరంపావులో ట్రెల్లీస్ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగుచేసి సత్ఫలితాలను పొందుతున్నారు.
READ ALSO : Green Leafy Vegetables : సిరులు పండిస్తున్న ఆకుకూరల సాగు
ఇదితో ఇక్కడ చూడండీ… ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటను .. ఇది ట్రెల్లీస్ విధానం. సాధారణ రింగ్ పద్ధతి అయితే స్థంబానికి నాలుగు పక్కల నాలుగు మొక్కలు ఉండి.. ఎకరాకు 500 స్థంబాలు ఉండి 2 వేల మొక్కలు వస్తాయి. పెట్టుబడి కూడా ఎకరాకు 5 నుండి 6 లక్షల వరకు అవుతుంది. పెట్టిన పెట్టుబడి చేతికి రావాలంటే 4 ఏళ్ల సమయం పడుతుంది. అందుకే తక్కువ సమయంలోనే పెట్టుబడిని పొందేందుకు ఇప్పుడు రైతులు ట్రెల్లీస్ విధానాన్ని పాటిస్తున్నారు.
READ ALSO : Protecting Your Lungs : ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి !
ఈ విధానంలో స్థంబాల సంఖ్య అంతే ఉన్నా… మొక్కల సంఖ్య పెరుగుతుంది. అంటే ఎకరాకు 2 వేల మొక్కలు ఉన్న చోట 3 నుండి 4 వేల మొక్కలను నాటుతున్నారు. ఈ విధానంలో అధిక దిగుబడిని పొందవచ్చు. అంతే కాదు 3 ఏళ్లకే పంట పెట్టుబడి చేతికి వస్తుండటంతో.. ఇదే విధానంలో కడప జిల్లా, లింగాల మండలం, అక్కులుగారిపల్లి గ్రామానికి చెందిన రైతు నరాల రవిశంకర్ రెడ్డి ఎకరంపావులో తైవాన్ పింక్, జంబోరెడ్ రెండు రకాల డ్రాగన్ ఫ్రూట్స్ ను సాగుచేస్తూ సత్ఫలితాలను పొందుతున్నారు.
డ్రాగన్ ఫ్రూట్ రైతులకు మేలు చేసే పంట. సాగులో పెద్దగా పని ఉండదు. మందులు వేయాల్సిన పనిలేదు. నీటి అవసరం చాలా తక్కువే. సేంద్రియ పద్ధతిలో పంట పండించవచ్చు. సులభ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. రైతులకు మంచి లాభాలు వస్తాయి. పంట వేసిన్నప్పుడు ఒక్కసారి మాత్రమే ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఖర్చు ఉండదు. ప్రతి రైతు కొంత విస్తీర్ణంలో సాగుచేస్తే దీర్ఘకాలంగా లాభాలను పొందే అవకాశం ఉంటుంది .