Jewel Thief : ‘జ్యువెల్ థీఫ్’ టీజర్ రిలీజ్.. 30 ఇయర్స్ పృధ్వీ చేతుల మీదుగా..

తాజాగా జ్యువెల్ థీఫ్ సినిమా టీజర్ ను 30 ఇయర్స్ పృధ్వీ విడుదల చేశారు.

Jewel Thief : ‘జ్యువెల్ థీఫ్’ టీజర్ రిలీజ్.. 30 ఇయర్స్ పృధ్వీ చేతుల మీదుగా..

Krishna Sai Jewel Thief Teaser Released by 30 Years Prudhvi

Jewel Thief Teaser : కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘జ్యువెల్ థీఫ్’. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.

తాజాగా జ్యువెల్ థీఫ్ సినిమా టీజర్ ను 30 ఇయర్స్ పృధ్వీ విడుదల చేశారు. టీజర్ రిలీజ్ అనంతరం 30 ఇయర్స్ పృధ్వీ మాట్లాడుతూ.. కృష్ణసాయి జ్యువెల్ థీఫ్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ బాగా చేసాడు. ఈ సినిమాలో నా రోల్ కూడా బాగుంది. నేను, కృష్ణసాయి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులం. స‌మాజం కోసం కృష్ణ సాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృష్ణ సాయి పలు సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని అన్నారు. మీరు కూడా టీజర్ చూసేయండి..

హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ.. నేను సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని. ఆయన స్ఫూర్తితోనే సినిమాల్లోకి వ‌చ్చాను. జ్యువెల్ థీఫ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కించాము. ఈ సినిమాకు ఎంఎం శ్రీలేఖ అందించిన మ్యూజిక్ బాగుంది. హీరోయిన్ ప్రేమ గారి సినిమాలు చూసి ఆమెతో క‌లిసి న‌టించాల‌న్న నా కల ఈ సినిమాతో నెరవేరింది అని అన్నారు. నిర్మాత మల్లెల ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇది చిన్న సినిమా కాదు, సీనియర్ నటీనటులు చాలామంది ఉన్నారు. త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని చెప్పారు.