కాశ్మీర్ లోయలో వరుస భూకంపాలు.. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

కాశ్మీర్ లోయను స్వల్ప వ్యవధిలో వరుస భూకంపాలు వణికించాయి. మంగళవారం ఉదయం రెండు దఫాలుగా భూమి కంపించింది.

కాశ్మీర్ లోయలో వరుస భూకంపాలు.. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

jammu kashmir earthquake

Updated On : August 20, 2024 / 8:05 AM IST

Earthquake : కాశ్మీర్ లోయను స్వల్ప వ్యవధిలో వరుస భూకంపాలు వణికించాయి. మంగళవారం ఉదయం రెండు దఫాలుగా భూమి కంపించింది. జమ్మూకశ్మీర్ లోని పూంచ్ ప్రాంతంలో ఉదయం 6.45 గంటల సమయంలో భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత 4.9గా నమోదైంది. మరికొద్దిసేపటికే మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 4.6గా భూకంప తీవ్రత నమోదైంది. అయితే, వరుస భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భూకంపం దాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.

Also Read : Hyderabad : హైదరాబాద్ లో కుండపోత వర్షం.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు

శ్రీనగర్ లోని మెట్రోలాజికల్ ప్రకారం.. ఉదయం 6.45 గంటలకు భూకంపం సంభవించింది. దీని కేంద్రం ఉత్తర కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో ఉంది. అక్కడ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పొరుగు దేశం పాకిస్థాన్ లోనూ భూకంపం ప్రభావం కనిపించింది. జమ్మూకశ్మీర్ లో నెల వ్యవధిలో భూకంపం రావడం ఇది రెండోసారి అంతకుముందు జూలై 12న బురాముల్లాలో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.