ఆర్మూర్‌లో టెన్షన్ టెన్షన్.. ఆందోళనకు సిద్ధమైన రైతులు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. చలో ఆర్మూర్ కు రైతు ఐక్యవేదిక పిలుపునిచ్చింది. షరతులు లేని

ఆర్మూర్‌లో టెన్షన్ టెన్షన్.. ఆందోళనకు సిద్ధమైన రైతులు

Farmers Protest

Rythu Runa Mafi : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. చలో ఆర్మూర్ కు రైతు ఐక్యవేదిక పిలుపునిచ్చింది. షరతులు లేని రుణమాఫీ కోసం ఆర్మూర్ వేదికగా రైతులు ఆందోళనకు సిద్ధమయ్యారు. రైతులకు బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. అయితే, శాంతియుతంగా మహాధర్నా జరుపుకోవాలని ఆర్మూర్ ఏసీపీ బసవ రెడ్డి అనుమతినిచ్చారు. నేషనల్ హైవేపై ధర్నా, రాస్తారోకోలు అనుమతి లేదంటూ సీపీ కలమేశ్వర్ వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నేషనల్ హైవేపై ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు.

Also Read : కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన ఆ ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీరేనా?

రైతులు రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్లలో ఆంక్షలు ఉన్నాయని పోలీసులు సూచించారు. మహా ధర్నాకు నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్ నుంచి పెద్దెత్తున రైతులు తరలివచ్చే అవకాశం ఉంది. అయితే, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఛలో ఆర్మూర్ కార్యక్రమంలో రైతులు పాల్గొనకుండా కొందరు పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.