తెలంగాణ కాంగ్రెస్ కొత్త బాస్ ఇతడే..!

నూతన పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణపై ప్రధానంగా చర్చించారు.

తెలంగాణ కాంగ్రెస్ కొత్త బాస్ ఇతడే..!

Updated On : August 23, 2024 / 4:52 PM IST

Telangana Congress New Chief : తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే, రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరి భేటీ గంటపాటు సాగింది. నూతన పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణపై ప్రధానంగా చర్చించారు.

షబ్బీర్ అలీ కోసం సీటు త్యాగం..
పీసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సుమారు గంటకు పైగా సమావేశం అయ్యారు. ప్రధానంగా నూతన పీసీసీ ఎన్నిక, మంత్రివర్గ విస్తరణ అంశాలపై చర్చించారు. నూతన పీసీసీగా మహేశ్ కుమార్ గౌడ్ పేరును దాదాపుగా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 30ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న వ్యక్తి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు మహేశ్ కుమార్ గౌడ్. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని షబ్బీర్ అలీ కోసం ఆయన త్యాగం చేశారు. పార్టీకి విశ్వాసంగా ఉన్న మహేశ్ కుమార్ గౌడ్ పేరును సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి సూచించినట్లు తెలుస్తోంది.

పార్టీలో కీలక బాధ్యతల నిర్వహణ..
మధుయాష్కి గౌడ్ పేరు కూడా చర్చకు వచ్చింది. అయితే, అభ్యర్థుల జాబితాలో బీసీలకు అన్యాయం జరుగుతోంది అంటూ అధిష్టానానికి వ్యతిరేకంగా మధుయాష్కి గౌడ్ ఢిల్లీలో సమావేశాలు నిర్వహించారని తెలుస్తోంది. దాంతో మహేశ్ కుమార్ గౌడ్ వైపే రేవంత్ మొగ్గుచూపినట్లుగా సమాచారం. దాంతో తెలంగాణ పీసీసీగా మహేశ్ ను నియమించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఎన్ ఎస్ యూఐ ప్రెసిడెంట్ నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు మహేశ్ కుమార్ గౌడ్. దాంతో పాటు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నేతల మధ్య సమన్వయంలో కూడా కీలక పాత్ర పోషించారు. దాంతో మహేశ్ కుమార్ గౌడ్ ఈ పదవికి అర్హుడు అన్న సంకేతాన్ని రాష్ట్ర నాయకత్వం ఇవ్వడంతో ఆయనకే పీసీసీ పదవి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

 

Also Read : నెక్ట్స్.. బీఆర్ఎస్ నేతల ఫామ్‌హౌస్‌లు కూలుస్తారా..? హైడ్రా అసలు టార్గెట్ అదేనా?