Shikhar Dhawan : క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన శిఖ‌ర్ ధావ‌న్.. ఎక్స్‌లో షేర్ చేసిన వీడియోలో ఆసక్తికర విషయాలు వెల్లడి

ధావన్ తన మొదటి టెస్ట్ ఆస్ట్రేలియాతో మొహాలీలో ఆడాడు. 2013 నుంచి ఇప్పటి వరకు 34టెస్టుల్లో ఆడిన ధావన్.. తన చివరి టెస్టును ..

Shikhar Dhawan : క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన శిఖ‌ర్ ధావ‌న్.. ఎక్స్‌లో షేర్ చేసిన వీడియోలో ఆసక్తికర విషయాలు వెల్లడి

Shikhar Dhawan

Shikhar Dhawan Retires : టీమిండియా స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ కు ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటిస్తూ ధావన్ వీడియోను విడుదల చేశారు. నా క్రికెట్ ప్రయాణంలో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నప్పుడు.. నేను లెక్కలేనన్ని జ్ఞాపకాలను, కృతజ్ఞతా భావాన్ని నా వెంట తీసుకెళ్తున్నాను. దేశంకోసం ఆడినందుకు సంతోషిస్తున్నా.. నా ప్రయాణంలో ఎంతో మంది సహాయం చేశారు. వారివల్లే ఈ స్థాయికి వచ్చానని శేఖర్ ధావన్ అన్నారు. ఇన్నాళ్లు మీ ప్రేమ, మద్దతును నాపై ఉంచినందుకు ధన్యవాదాలు అంటూ ధావన్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : విరాట్ కోహ్లీ జెర్సీ రూ.40లక్షలు.. ధోనీ, రోహిత్ బ్యాట్‌కు వేలంలో భారీ ధర.. ఆ డబ్బును ఏం చేశారంటే?

శిఖర్ ధావన్ 2010లో భారత్ జట్టు తరపున అరంగేట్రం చేశాడు. అతని 13ఏళ్ల కెరీర్ లో 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్ లు ఆడాడు. టెస్టుల్లో 2,315 పరుగులు చేయగా.. వన్డేల్లో 6,793 పరుగులు, టీ20ల్లో 1,759 పరుగులు చేశాడు. వన్డేల్లో 17, టెస్టుల్లో ఏడు సెంచరీలు ధావన్ ఖాతాలో ఉన్నాయి. రిటైర్మెంట్ సందర్భంగా ధావన్ విడుదల చేసిన వీడియోలో ‘ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు చాలా జ్ఞాపకాలు కనిపిస్తున్నాయి.. ముందుచూపుతో చూస్తే ప్రపంచం మొత్తం కనిపిస్తోందని’ పేర్కొన్నాడు.

Also Read : Shakib Al Hasan : చిక్కుల్లో షకీబ్‌ అల్ హసన్‌.. పాక్‌లో క్రికెట్ ఆడుతుంటే.. బంగ్లాదేశ్‌లో మ‌ర్డ‌ర్ కేసు..

ధావన్ తన మొదటి టెస్ట్ ఆస్ట్రేలియాతో మొహాలీలో ఆడాడు. 2013 నుంచి ఇప్పటి వరకు 34టెస్టుల్లో ఆడిన ధావన్.. తన చివరి టెస్టును 2018లో ఆడాడు. 2010లో విశాఖపట్టణంలో ఆస్ట్రేలియాతో భారత్ తరపున ధావన్ తన తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ లో ధావన్ 222 మ్యాచ్ లు ఆడాడాడు. 6,769 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 51 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన వారిలో కోహ్లీ తరువాత రెండో స్థానంలో ధావన్ ఉన్నాడు.