విరాట్ కోహ్లీ జెర్సీ రూ.40లక్షలు.. ధోనీ, రోహిత్ బ్యాట్‌కు వేలంలో భారీ ధర.. ఆ డబ్బును ఏం చేశారంటే?

భారత్ టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ ను కూడా క్రికెట్ ఫర్ ఛారిటీ కింద వేలం వేశారు. ఈ వేలంలో రోహిత్ బ్యాట్ కు ..

విరాట్ కోహ్లీ జెర్సీ రూ.40లక్షలు.. ధోనీ, రోహిత్ బ్యాట్‌కు వేలంలో భారీ ధర.. ఆ డబ్బును ఏం చేశారంటే?

KL Rahul

KL Rahul Cricket for Charity Auction : భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, అతని భార్య, బాలీవుడ్ నటి అతియా శెట్టి ఇటీవల ‘క్రికెట్ ఫర్ ఛారిటీ’ వేలం నిర్వహించారు. నిరుపేద పిల్లలకు విద్యను అందించడానికి కృషి చేస్తున్న విప్లవ సంస్థకు సహాయం చేయడానికి ఈ వేలం నిర్వహించారు. ఈ వేలంలో చాలా మంది ప్రముఖ క్రికెటర్లు తమ వ్యక్తిగత వస్తువులను అందించారు. అందులో ఒకటి విరాట్ కోహ్లీ జెర్సీ. ఆ జెర్సీ వేలంలో రూ. 40లక్షలకు అమ్ముడైంది. కోహ్లీ వినియోగించిన గ్లోవ్స్ పై వేలంలో రూ. 28 లక్షలు లభించాయి.

Also Read : Viral Video : ఈ వీడియో చూసి న‌వ్వ‌కుండా ఉండ‌లేరు.. వీడు క్యాచ్ ప‌ట్టేలోపు అంపైర్ వెకేష‌న్‌కు వెళ్లి రావొచ్చు..

భారత్ టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ ను కూడా క్రికెట్ ఫర్ ఛారిటీ కింద వేలం వేశారు. ఈ వేలంలో రోహిత్ బ్యాట్ కు రూ. 24లక్షలు లభించాయి. ఎంఎస్ ధోనీ బ్యాట్ కు రూ. 13లక్షలు, రాహుల్ ద్రవిడ్ బ్యాట్ కు రూ. 11లక్షలు లభించాయి. కేఎల్ రాహుల్ తన జెర్సీని కూడా వేలం వేయగా.. రూ. 11లక్షలు లభించాయి. కేఎల్ రాహుల్, అతియా శెట్టి ప్రారంభించిన ఈ ప్రచారంలో జస్ర్పీత్ బుమ్రా, రిషబ్ పంత్, సంజూ శాంసన్ కూడా భాగస్వాములయ్యారు. వీరితోపాటు జోస్ బట్లర్, క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్ వంటి అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు కూడా ఈ ప్రచారంలో భాగస్వాములయ్యారు.

Also Read : కేఎల్ రాహుల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? ఆ పోస్టుకు అర్థమేంటో ..

నివేదిక ప్రకారం.. క్రికెట్ ఫర్ ఛారిటీ వేలంలో మొత్తం రూ. 1.93కోట్ల నిధులు సమకూరాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కథనాన్ని పోస్టు చేసిన కేఎల్ రాహుల్.. స్వయంగా తమ వేలం విజయవంతం అయిందని, ఈ డబ్బు మొత్తం నిరుపేద పిల్లల చదువుకోసం వినియోగిస్తానని తెలిపాడు. ఓ మంచి కార్యక్రమానికి మద్దతుగా నిలుస్తున్న కేఎల్ రాహుల్, అతియాల పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

 

KL Rahul