తిక్క కుదిరింది..! గాల్లోకి డబ్బులు విసిరిన యూట్యూబర్ అరెస్ట్, తాట తీస్తామని పోలీసుల వార్నింగ్

సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు హర్ష గాల్లోకి డబ్బులు విసిరేశాడు

తిక్క కుదిరింది..! గాల్లోకి డబ్బులు విసిరిన యూట్యూబర్ అరెస్ట్, తాట తీస్తామని పోలీసుల వార్నింగ్

Updated On : August 23, 2024 / 9:02 PM IST

Youtuber Harsha Arrest : యూట్యూబర్ హర్షను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కూకట్ పల్లిలో కరెన్సీ నోట్లను గాల్లోకి విసిరిన ఘటనలో హర్షపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ మధ్యలో డబ్బులు గాల్లోకి విసిరాడు హర్ష. కరెన్సీ నోట్లు గాల్లోకి విసిరి వీడియోలు తీసుకున్నాడు. డబ్బు కోసం జనాలు పరుగులు తీశారు. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు హర్ష గాల్లోకి డబ్బులు విసిరేశాడు. హర్షతో చర్యతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగిందని ఫిర్యాదులు అందడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

వైరల్ వీడియోల కోసమో, సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకో.. పబ్లిక్ లో పిచ్చిపిచ్చిగా రీల్స్ చేస్తే తాట తీస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పబ్లిక్ ను ఇబ్బంది పెట్టేలా చిల్లర పనులు చేస్తే కటకటాల్లోకి నెడతామన్నారు.

Also Read : మనిషి రూపంలో ఉన్న మృగం, ఒళ్లంతా కామం.. కోల్‌కతా డాక్టర్ కేసులో నిందితుడి గురించి విస్తుపోయే విషయాలు

యూట్యూబర్ వంశీ కుమార్ అలియాస్ హర్ష నడిరోడ్డుపై గాల్లోకి డబ్బులు విసురుతూ బైక్ పై స్టంట్స్ చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకే అతడిలా వ్యవహరించాడు. హర్ష డబ్బులు విసరడంతో వాటిని తీసుకునేందుకు జనం పరుగులు తీశారు. ముందు వెనుక చూసుకోకుండా రోడ్డుపై పరుగులు తీశారు. హర్ష చేసిన పనిని అంతా తప్పుపడుతున్నారు. నడిరోడ్డుపై ట్రాఫిక్ ఉన్న ప్రాంతంలో ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు. తన రీల్స్ కోసం అతడు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడమే కాకుండా.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాడని మండిపడుతున్నారు.

ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను అలానే వదిలేస్తే.. మరో పది మంది వీడిలానే తయారవుతారని సీరియస్ అవుతున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడంతో పాటు ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఫిర్యాదులు అందడంతో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ కూడా చేశారు.

రోడ్డు మీద డబ్బు విసరడం, వాటిని వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం.. ఇదీ యూట్యూబర్ హర్ష తీరు. అతడిపై ఫిర్యాదులు అందడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ కూడా చేసి తిక్క కుదిర్చారు. పబ్లిక్ ను ఇబ్బంది పెట్టేలా రీల్స్ చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని పోలీసులు గట్టి మేసేజ్ పంపారు.

సనత్ నగర్, కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లలో హర్షపై కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజుల క్రితం హర్ష చేసిన వీడియో రెండు రోజులుగా వైరల్ అయ్యింది. దీనిపై కూకట్ పల్లి ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు హర్షపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు కూకట్ పల్లి పోలీసులు. హర్షను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆకతాయిలు ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఇష్టారాజ్యంగా ఇలా రీల్స్ చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హైదరాబాద్ పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.