Dream Home : హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌ జోరు!

Dream Home : ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ తమ కార్యాలయాలను హైదరాబాద్‌లో నెలకొల్పుతుండటంతో ఇక్కడ కార్యాలయ భవనాలకు మంచి డిమాండ్ ఏర్పడింది.

Dream Home : హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌ జోరు!

Commercial Office Space in Hyderabad

Dream Home : హైదరాబాద్ ముందు నుంచి ఐటీలో మంచి దూకుడు చూపిస్తోంది. అందుకు తోడు ఫార్మా, మెడికల్, లైఫ్ సైన్సెస్, ఫిన్‌ టెక్‌ రంగాల్లోనూ మంచి అభివృద్ధి నమోదు చేస్తోంది. దీంతో భాగ్యనగరం ఆఫీస్ స్పేస్ నిర్మాణంలో, లీజింగ్‌లో రారాజుగా వెలుగొందుతోంది.

Read Also : Dream Home : ముచ్చర్లలో కలల నగరం.. మరో సిటీ నిర్మాణానికి ప్రభుత్వం ప్లాన్‌!

ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ తమ కార్యాలయాలను హైదరాబాద్‌లో నెలకొల్పుతుండటంతో ఇక్కడ కార్యాలయ భవనాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగా జాతీయ అంతర్జాతీయ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలన్నీ హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ నిర్మాణాలపై దృష్టి సారించాయి. గృహ నిర్మాణ మార్కెట్‌తో పోలిస్తే హైదరాబాద్‌లో కార్యాలయాల నిర్మాణ మార్కెట్ బాగా వృద్ధి చెందుతోంది. దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో దూకుడు మీదుంది.

మంచి వాతావరణ పరిస్థితులున్న గ్రేటర్ హైదరాబాద్ నగరంలో రియాల్టీ రంగం టాప్‌ స్పీడ్‌లో దూసుకుపోతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీలో నివాస సముదాయాలతో పాటు కమర్షియల్‌ స్పేస్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. వెస్ట్‌ జోన్‌తో పాటు ఐటీ ఆధారిత ప్రాంతాల్లో కార్యాలయాలకు డిమాండ్‌ భారీగా ఉంది. అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు మన విశ్వనగరంలో కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటంతో… ప్రస్తుతం ఉద్యోగాల కల్పన కూడా భారీగా పెరిగింది.

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్‌తో పాటుగా గ్లోబల్ క్యాపబిలీటి సెంటర్లు.. ఆఫీస్‌ స్పేస్ కోసం చూస్తుండటంతో డిమాండ్ పెరిగినట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి తోడు రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చే అవకాశముండటంతో హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు బూస్టింగ్‌ రానుంది.

గ్రేటర్‌ సిటీలో ఎక్కువ సంఖ్యలో వాణిజ్య నిర్మాణాలున్న ప్రాజెక్టులకు చక్కని డిమాండ్‌ ఉంది. హైదరాబాద్ నగరంలో పెద్ద సంఖ్యలో మాల్స్‌ నిర్మించడంతో పెద్ద మొత్తంలో కమర్షియల్‌ స్పేస్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే కొన్ని ప్రాంతాల్లో చాలా వరకు రిటైల్ మార్కెట్స్ ఏర్పాటుకు ఆసక్తి కనబరుస్తున్నారు వ్యాపారులు. పాత మాల్స్‌ను పునర్‌ నిర్మించి సరికొత్తగా తమ మార్కెట్‌ను విస్తరిస్తున్నారు. ఇలా మొత్తం సిటీలో కమర్షియల్ స్పేస్‌కు డిమాండ్‌ భారీగా పెరిగింది.

Read Also : Dream Home : ప్రాపర్టీ షో‎పై మక్కువ చూపుతున్న హైదరాబాదీలు