కూల్చేస్తే తప్పేంటి..? హైడ్రా కూల్చివేతలపై ఎంపీ రఘునందన్ స్పెషల్ ఇంటర్వ్యూ..

కేవలం బీఆర్ఎస్ ను టార్గెట్ చేసేందుకే హైడ్రాను ముందుకు తెచ్చారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తుంటే.. బీజేపీ నేతలు మాత్రం హైడ్రా కూల్చివేతలపై తలోమాట మాట్లాడుతున్నారు.

కూల్చేస్తే తప్పేంటి..? హైడ్రా కూల్చివేతలపై ఎంపీ రఘునందన్ స్పెషల్ ఇంటర్వ్యూ..

Raghunandan Rao Madhavaneni : హైదరాబాద్ లో హైడ్రా దడ పుట్టిస్తోంది. నగరంలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఓవైపు బడా బాబులకు షాక్ ఇస్తున్న హైడ్రా.. అదే సమయంలో తెలిసీ తెలియక ఎక్కడో చిన్న బిల్డర్ల వద్ద అక్రమ నిర్మాణాలను కొనుగోలు చేసిన సామాన్యులను సైతం హడలెత్తిస్తోంది. ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీల మధ్య యుద్ధం జరుగుతోంది. కేవలం బీఆర్ఎస్ ను టార్గెట్ చేసేందుకే హైడ్రాను ముందుకు తెచ్చారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తుంటే.. బీజేపీ నేతలు మాత్రం హైడ్రా కూల్చివేతలపై తలోమాట మాట్లాడుతున్నారు.

కూల్చేస్తే తప్పేంటి.. అంటూ హైడ్రాకు ఫుల్ సపోర్ట్ గా నిలిచారు ఎంపీ రఘునందన్ రావు. కచ్చితంగా హైదరాబాద్ లో చెరువులను పరిరక్షించాలి, ఇందుకోసం అక్రమ నిర్మాణాలను కూల్చేయాల్సిందే, అక్రమ నిర్మాణాలు చేసిన వారిలో ఎంత పెద్ద వాళ్లున్నా భూస్థాపితం చేయాల్సిందే అంటున్నారు రఘునందన్. హైదరాబాద్ లో చెరువులను రక్షించాలంటే కూల్చివేతలను హైడ్రా కొనసాగించాల్సిందే అంటూ తేల్చి చెబుతున్నారు.

మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోలా స్పందించారు. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని రేవంత్ సర్కార్ పై ధ్వజమెత్తారు. అప్పుడు అనుమతులు ఇచ్చి ఇప్పుడు కూల్చివేతలు ఎలా చేస్తారు? అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. విద్యుత్, నీరు, రోడ్ల సదుపాయం ఇలా అన్నీ.. అక్రమ నిర్మాణాలకు కల్పించింది ప్రభుత్వమే కదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

బీజేపీలో ఈ రకమైన రెండు రకాల వాదనలు ఎందుకు వినిపిస్తున్నాయి? అసలు అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చాల్సిన అవసరం ఉందని రఘునందన్ రావు ఎందుకు నమ్ముతున్నారు? బీజేపీ ఎంపీ రఘునందన్ రావుతో స్పెషల్ ఇంటర్వ్యూ..

Also Read : ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు