ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
ఎఫ్ టీఎల్ లో ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్ లో 2 ఎకరాల 18 గుంటలు ఆక్రమించారని రంగనాథ్ చెప్పారు.

N Convention Demolition : చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఎన్ కన్వెన్షప్ పై ఎలాంటి స్టే లేదని ఆయన స్పష్టం చేశారు. వ్యవస్థను తప్పుదారి పట్టించి వ్యాపార కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో అనుమతి లేని నిర్మాణాలు చేపట్టారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంటున్నారు. ఎఫ్ టీఎల్ లో ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్ లో 2 ఎకరాల 18 గుంటలు ఆక్రమించారని రంగనాథ్ చెప్పారు. ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలకు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతి లేదని హైడ్రా కమిషనర్ తేల్చారు.
”సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కు జీహెచ్ ఎంసీ నుంచి నిర్మాణ అనుమతులు లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనుమతుల కోసం ప్రయత్నించారు. కానీ అధికారులు అనుమతి ఇవ్వలేదు. తుమ్మిడికుంట చెరువులోని ఎఫ్ టీఎల్ లో 1.12 ఎకరాల్లో, బఫర్ జోన్ లోని 2.18 ఎకరాల్లో కన్వెన్షన్ నిర్మించారు. ఎన్ కన్వెన్షన్ తో సహా అక్రమ నిర్మాణాలు కూల్చేశాం” అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
నాగార్జున చెప్పినట్లుగా ఎన్ కన్వెన్షన్ పై ఎలాంటి స్టే లేదు-హైడ్రా కమిషనర్ రంగనాథ్
సినీ నటుడు నాగార్జున చెప్పినట్లుగా ఎన్ కన్వెన్షన్ పై ఎలాంటి స్టే లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చాలా క్లియర్ గా చెప్పారు. 2014లోనే చెరువుకు సంబంధించిన ఎఫ్ టీఎల్ ను, బఫర్ జోన్ ను ఫిక్స్ చేయడం జరిగిందన్నారు. అప్పట్లో దీనికి సంబంధించి సంయుక్తంగా సర్వే చేయమని కోర్టు చెప్పిందన్నారు. కోర్టు ఆదేశాలతో ఎన్ కన్వెన్షన్ యాజమాన్యంతో కలిసి సర్వే చేశామన్నారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ ను అప్పటికే ఫిక్స్ చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ మియాపూర్ లో ఉండే కోర్టుకు వెళ్లారని, కేసు నడుస్తోంది తప్ప దానిపై ఎలాంటి స్టే లేదని హైడ్రా కమిషనర్ తేల్చి చెప్పారు.
చెరువును ఆక్రమించి నిర్మాణాలు- హైడ్రా కమిషనర్ రంగనాథ్
ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ ను ఫిక్స్ చేసిన తర్వాత కూడా కొన్ని నిర్మాణాలు జరిగాయని హైడ్రా కమిషనర్ వెల్లడించారు. అంతేకాకుండా వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ వ్యాపారాలు చేశారని చెప్పారు. నిర్మాణాలకు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేవని హైడ్రా కమిషనర్ తేల్చి చెప్పారు. నాగార్జున చెప్పినట్లుగా ఎన్ కన్వెషన్ పై కోర్టు స్టే లేదని స్పష్టం చేశారు. చెరువులో చేపట్టిన నిర్మాణాల కారణంగా దాదాపు 50 నుంచి 60శాతం వాటర్ స్ప్రెడ్ ఏరియా తగ్గిపోతుందని, దాని వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నారు.
వరద ఎక్కువగా వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారి ఇళ్లలోకి నీరు చేరి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హైడ్రా అధికారులు చెబుతున్నారు. ఆ కారణంగానే తమకు వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో కూల్చివేతలు చేపట్టామన్నారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాల అధికారుల సమక్షంలో ఎన్ కన్వెషన్ నిర్మాణాలను నేలమట్టం చేశామని హైడ్రా కమిషనర్ తెలిపారు.
Also Read : ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల్లో ట్విస్ట్.. మంత్రి ఫిర్యాదుతోనే రంగంలోకి హైడ్రా బృందం!