Vivo Y18i Launch : వివో సరికొత్త ఫోన్ చూశారా? కెమెరా ఫీచర్లు అదుర్స్.. భారత్‌లో ధర ఎంతంటే?

Vivo Y18i Launch : భారత మార్కెట్లో వివో వై18ఐ సింగిల్ 4జీబీ+64జీబీ ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ. 7,999కు అందిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో విక్రయిస్తోంది.

Vivo Y18i Launch : వివో సరికొత్త ఫోన్ చూశారా? కెమెరా ఫీచర్లు అదుర్స్.. భారత్‌లో ధర ఎంతంటే?

Vivo Y18i With Unisoc T612 SoC, 13-Megapixel Rear Camera Launched ( Image Source : Google )

Vivo Y18i Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి వివో నుంచి సరికొత్త ఫోన్ లాంచ్ అయింది. 4జీ కనెక్టివిటీతో వివో వై18ఐ తీసుకొచ్చింది. యూనిసోక్ టీ612 చిప్‌సెట్‌తో వస్తుంది. ఫన్‌టచ్ ఓఎస్ 14పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14పై ఆధారపడి ఉంటుంది. వివో వై18ఐ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌తో పాటు 13ఎంపీ బ్యాక్ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ54 రేటింగ్‌ను కలిగి ఉంది.

Read Also : iPhone 16 Series Price : ఐఫోన్ 16 సిరీస్ ధర, కీలక ఫీచర్లు లీక్.. అన్ని మోడల్స్‌కు ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టు..!

భారత్‌లో వివో వై18ఐ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో వివో వై18ఐ సింగిల్ 4జీబీ+64జీబీ ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ. 7,999కు అందిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో విక్రయిస్తోంది. కంపెనీ ఇ-స్టోర్, అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్, క్రోమా వంటి రిటైలర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.

వివో వై18ఐ స్పెసిఫికేషన్‌లు :
డ్యూయల్-సిమ్ (నానో+నానో) వివో వై18ఐ ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14పై రన్ అవుతుంది. 6.56-అంగుళాల హెచ్‌డీ+ (720×1,612 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ స్క్రీన్‌ని కలిగి ఉంది. 60హెచ్‌జెడ్, 90హెచ్‌జెడ్ మధ్య ఉండే రిఫ్రెష్ రేట్, 528 నిట్స్ గరిష్ట ప్రకాశంతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 12ఎన్ఎమ్ ఆక్టా-కోర్ యూనిసోక్ టీ612 చిప్‌సెట్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. 4జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, వివో స్మార్ట్‌ఫోన్‌లో ఎఫ్/2.2 ఎపర్చర్‌తో 13ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 0.08ఎంపీ సెకండరీ కెమెరా (ఎఫ్/3.0)తో పాటు డెప్త్ డేటాను క్యాప్చర్ చేస్తుంది.

ముందు భాగంలో, 5ఎంపీ కెమెరా (ఎఫ్/2.2)ని కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌లు ఉపయోగించవచ్చు. మీరు మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా 1టీబీకి విస్తరించుకోవచ్చు. 64జీబీ ఇఎమ్ఎమ్‌సీ 5.1 స్టోరేజీని పొందుతారు. కనెక్టివిటీ ఆప్షన్లలో వై-ఫై 5, బ్లూటూత్ 5, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

యాక్సిలెరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్‌తో సహా బోర్డులో సెన్సార్‌లు ఉన్నాయి. వివో వై18ఐ కంపెనీ ప్రకారం.. 15డబ్ల్యూ వద్ద ఛార్జ్ చేయగల 5,000ఎంహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ నీటి నిరోధకతకు ఐపీ54 రేటింగ్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా, 163.63 x 75.58 x 8.39ఎమ్ఎమ్ 185గ్రాముల బరువు ఉంటుంది.

Read Also : Jio Roaming Plans : విదేశాలకు వెళ్తున్నారా? జియో కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లు ఇవే.. ఫుల్ లిస్ట్ మీకోసం..!