Telegram CEO : టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్‌ అరెస్ట్.. కారణం ఏమిటంటే?

టెలిగ్రామ్ ఫౌండర్, సీఈఓ పావెల్ దురోవ్ ను ఫ్రాన్స్ పోలీసులు అరెస్టు చేశారు.

Telegram CEO : టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్‌ అరెస్ట్.. కారణం ఏమిటంటే?

Telegram CEO Pavel Durov

Telegram Messaging App : టెలిగ్రామ్ ఫౌండర్, సీఈఓ పావెల్ దురోవ్ ను ఫ్రాన్స్ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. అజ‌ర్‌బైజాన్‌ నుంచి లే బోర్గట్ విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. ముందే సమాచారం అందుకున్న పోలీసులు విమానాశ్రయం వద్దకు చేరుకొని పావెల్ దురోవ్‌ను అరెస్టు చేశారు. ఆయన్ను ఆదివారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. పావెల్ అరెస్టుపై టెలిగ్రామ్ సంస్థ ప్రతినిధులు ఇంకా స్పందించలేదు. అయితే, ఆయన్ను అరెస్టుచేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఫ్రాన్స్ పోలీసులు తెలిపారు. పావెల్ అరెస్టు నేపథ్యంలో రష్యా బ్లాగర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్రెంచ్ రాయబార కార్యాలయాల వెలుపల నిరసనలను తెలుపనున్నట్లు ప్రకటించారు.

Also Read : Telegram : టెలిగ్రామ్‌లో ట్రాప్..కోట్లు కాజేస్తున్న కేటుగాళ్లు..

టెలిగ్రామ్ లో మోడరేటర్లు లేకపోవడం వల్ల మెసేజింగ్ యాప్ లో నేర కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాల్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలు పావెల్ పై ఉన్నాయి. దీంతో గతంలో అరెస్టు వారెంట్ ను అధికారులు జారీ చేశారు. తాజాగా ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని బోర్గెట్ విమానాశ్రయంలో శనివారం రాత్రి పోలీసులు పావెల్ ను అరెస్టు చేశారు. తనపై అరెస్టు వారెంట్ ఉందని తెలిసికూడా పావెల్ దురోవ్ పారిస్ కు రావడంపై విచారణ అధికారి ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Also Read : సునీతా విలియమ్స్ భూమికి తిరిగివచ్చే సమయాన్ని ప్రకటించిన నాసా.. ఎప్పుడంటే?

పావెల్ దురోవ్ రష్యాలో జన్మించారు. అతనికి 39ఏళ్లు. మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు. టెలిగ్రామ్ అనేది ఉచిత సోషల్ నెట్ వర్కింగ్ యాప్. దీనిని ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఫేస్ బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్, వీచాట్ ఉన్నప్పటికీ టెలిగ్రామ్ కు కూడా చాలా మంచి గుర్తింపు ఉంది. ఈ యాప్ కు ప్రస్తుతం 900 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. రష్యాలో జన్మించిన దువోవ్ 2014 సంవత్సరంలో ఆ దేశాన్ని వీడి దుబాయ్ లో ఉంటున్నాడు. రష్యా, యుక్రెయిన్, మాజీ సోవియట్ దేశాల్లో టెలిగ్రామ్ కు మంచి ఆదరణ ఉంది. వచ్చే ఏడాది నాటికి 100 మిలియన్ల మంది యూజర్లను చేరుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.

మెస్సేజింగ్ యాప్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ, అతని అధికారులకు కమ్యూనికేషన్ కు ప్రధాన మాధ్యమంగా వినియోగిస్తున్నారు. క్రెమ్లిన్, రష్యా ప్రభుత్వం కూడా తమ వార్తలను పంచుకోవడానికి టెలిగ్రామ్ ను ఉపయోగిస్తాయి. 2022లో యుక్రెయిన్, రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యుద్ధం చుట్టూ, రాజకీయాలకు సంబంధించి రెండు దేశాల నుంచి ఫిల్టర్ చేయని కంటెంట్ కోసం టెలిగ్రామ్ అత్యంత ప్రముఖ వేదికగా మారింది.