Nepal Bus Accident : నేపాల్‌లో నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. మృతులంతా భారతీయులే

ప్రమాదం జరిగిన వెంటనే ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు

Nepal Bus Accident : నేపాల్‌లో నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. మృతులంతా భారతీయులే

Nepal bus tragedy

Updated On : August 23, 2024 / 1:51 PM IST

Indian bus plunges into river in Nepal : నేపాల్‌లో భారతీయ పర్యటకులతో ప్రయాణిస్తున్న బస్సు నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 14మంది మృతిచెందగా.. పలువురు గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. మరికొందరు నదిలో గల్లంతయ్యారు. తనాహున్ జిల్లాలో కొండల ప్రాంతంలో అదుపు తప్పి మర్స్యాంగ్డి నదిలో బస్సు పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా భారతీయులే. ఉత్తరప్రదేశ్ నెంబర్ ప్లేట్ తో ఉన్న ఓ ట్రావెల్స్ బస్సు శుక్రవారం ఉదయం నేపాల్ లోని పొఖారా నుంచి కాఠ్ మాండూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Also Read : తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం.. మోసగాళ్ల బారిన పడ్డ శ్రీవారి భక్తులు

ప్రమాదం జరిగిన వెంటనే ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, 14మంది మృతదేహాలను వెలికితీయగా.. 16మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బస్సు ప్రమాదం సమయంలో 40 మంది ఉండగా.. మరో పది మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ స్పందించారు. స్థానిక అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నట్లు తెలిపారు.

Also Read : నడిరోడ్డుపై డబ్బులు గాల్లోకి ఎగరేసిన యూట్యూబర్ హర్ష.. కేసు నమోదు చేసిన పోలీసులు