Canada : కెనడాలో భారతీయ విద్యార్థుల ఆందోళన.. ఆ దేశ ప్రభుత్వం నిర్ణయాలతో ఇండియన్స్‌కు జరిగే నష్టమేమిటంటే?

వచ్చే మూడేళ్లలో దేశ జనాభాలో తాత్కాలిక విదేశీ నివాసితుల సంఖ్యను ఐదుశాతంకు తగ్గించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త విధానం ప్రకారం..

Canada : కెనడాలో భారతీయ విద్యార్థుల ఆందోళన.. ఆ దేశ ప్రభుత్వం నిర్ణయాలతో ఇండియన్స్‌కు జరిగే నష్టమేమిటంటే?

Indian Students Protest

Indian Students Protest Against Canadian Government : కెనడాలో భారతీయ విద్యార్థులు పెద్దెత్తున నిరసనలకు దిగుతున్నారు. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ నిరసన ర్యాలీలు చేపట్టారు. ప్రిన్స్ ఎడ్వర్ట్ ఐలాండ్ తోపాటు, అంటారియో, మనితోబా, బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ లలో నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఇంతకీ కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఏమిటి.. వాటివల్ల ఆ దేశంలోని విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు వచ్చే ఇబ్బంది ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం.

Also Read : Tech Tips in Telugu : మీ ఆధార్ కార్డులో బయోమెట్రిక్ డేటాను ఎలా అన్‌లాక్ చేయాలంటే? ఇదిగో ప్రాసెస్..!

గత కొన్నేళ్లుగా కెనడా దేశంలో విదేశీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఎంతలా అంటే.. గత ఏడాదిలో పెరిగిన దేశ జనాభాలో 97శాతం మంది విదేశాల నుంచి వచ్చి స్థిరపడిన వారే. జనాభా సంఖ్య విపరీతంగా పెరగడంతో స్థానికంగా ఇళ్లు, ఉద్యోగాల సంక్షోభం తలెత్తింది. ఆ దేశ యువతకు ఉద్యోగాల కొరత ఏర్పడింది. దీంతో తాత్కాలిక నివాస అనుమతులను తగ్గించాలనే డిమాండ్లు మొదలయ్యాయి. సర్వేల్లో ట్రూడో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. దీనికితోడు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించేందుకు ప్రధాని ట్రూడో కీలక నిర్ణయం తీసుకున్నాడు. కెనడాకు వలస వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నాలను అక్కడి ప్రభుత్వం ముమ్మరం చేసింది. తక్కువ వేతన విభాగాల్లో తాత్కాలికంగా నియమించుకునే విదేశీ వర్కర్ల వాటాను తగ్గించుకుంటున్నట్లు ప్రధాని జస్టిస్ ట్రూడో పేర్కొన్నాడు. ప్రభుత్వం విదేశీ తాత్కాలిక వర్కర్ల వీసాలపై కెనడా పరిమితిని విధించింది. 2022లో తెచ్చిన వర్క్ పర్మిట్లను విస్తరించాలనుకున్న విధానానికి స్వస్తి పలికింది. ప్రభుత్వం చర్యల ద్వారా ఆ దేశంలోని 70వేల మంది భారతీయులపై ప్రభావం పడనుంది.

Also Read : Telegram CEO : టెలిగ్రామ్ సీఈఓ అరెస్ట్‌తో మిస్టీరియస్ మహిళకు లింకేంటి? ఇంతకీ, ఎవరీ జూలీ వావిలోవా?

కెనడా ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న కొత్త వలస విధానం వల్ల శాశ్వత నివాస నామినేషన్లు 25శాతం తగ్గనున్నాయి. దీంతోపాటు స్టడీ పర్మిట్లూ పరిమితం అవుతాయి. దీనివల్ల భారతీయ విద్యార్థులకు అధిక నష్టం కలుగుతుంది. భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఉత్తర అమెరికా దేశాలకు భారీగా వలస వెళ్తుంటారు. అందులో అమెరికా, కెనడా అత్యంత ప్రధానమైనవి. ఈ క్రమంలో కెనడాకు భారీ సంఖ్యలో భారతీయ విద్యార్థులు విద్య, ఉద్యోగాలకోసం వెళ్లారు. ప్రస్తుతం కెనడా తెచ్చిన నూతన వలస విధానంతో వెనక్కి పంపుతారనే ఆందోళన భారతీయ విద్యార్థుల్లో నెలకొంది.
వచ్చే మూడేళ్లలో దేశ జనాభాలో తాత్కాలిక విదేశీ నివాసితుల సంఖ్యను ఐదుశాతంకు తగ్గించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త విధానం ప్రకారం.. నిరుద్యోగిత రేటు 6శాతం కంటే అధికంగా ఉన్న ప్రాంతాల్లో వర్క్ పర్మిట్లను తిరస్కరిస్తారు. కేవలం వ్యవసాయం, ఆహార శుద్ది, నిర్మాణ రంగం, ఆరోగ్య రంగాలను దీని నుంచి మినహాయించారు. ఎందుకంటే.. ఈ రంగాల్లో ఉద్యోగుల కొరత ఉండటమే దీనికి కారణం.