Reliance Jio Plans : గుడ్ న్యూస్.. జియో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు!
Reliance Jio Plans : రూ. 1299 జియో ప్రీపెయిడ్ ప్లాన్ 2జీబీ రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. కొత్త రీఛార్జ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ 5జీ డేటా, 2జీబీ రోజువారీ 4జీ డేటాను అందిస్తుంది.

Reliance Jio launches 2 new prepaid plans with free Netflix subscription ( Image Source : Google )
Reliance Jio Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. కొత్త జియో ప్లాన్‌లు ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లను అందించడమే కాకుండా అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. కొత్త రూ. 1,299, రూ. 1,799 జియో ప్రీపెయిడ్ ప్లాన్ ఉంది. కొనుగోలు చేసిన తర్వాత 84 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also : Tecno Phantom V Fold 2 5G : టెక్నో నుంచి మడతబెట్టే ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు, ధర లీక్..!
జియో ఫ్రీ నెట్‌ఫ్లిక్స్‌తో 2 కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు :
రూ. 1299 జియో ప్రీపెయిడ్ ప్లాన్ 2జీబీ రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. కొత్త రీఛార్జ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ 5జీ డేటా, 2జీబీ రోజువారీ 4జీ డేటాను అందిస్తుంది. ప్యాక్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అత్యంత ఖరీదైన ప్యాక్ రూ. 1799తో రోజుకు 3జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను కూడా అందిస్తుంది.
ఇందులో రోజుకు 100ఎస్ఎంఎస్ కూడా ఉంటుంది. ఇది కూడా అన్‌లిమిటెడ్ 5జీ డేటా, 3జీబీ 4జీ డేటాను ఇస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల పాటు వ్యాలిడిటీ అవుతుంది. రెండు ప్లాన్‌లు వేర్వేరు (ఉచిత) నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌లను యూజర్లకు అందిస్తున్నాయని గమనించాలి. రూ. 1299 జియో ప్రీపెయిడ్ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్యాక్‌కి ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తుంది. రూ. 1799 ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ కూడా ఉంటుంది.
నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ వివరాలు :
నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ ధర నెలకు రూ. 149కు పొందవచ్చు. అన్‌లిమిటెడ్ యాడ్-ఫ్రీ మూవీలు, టీవీ కార్యక్రమాలు, మొబైల్ గేమ్‌లతో సహా ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, బడ్జెట్ ప్లాన్ అయినందున ఒకేసారి ఒక ఫోన్ లేదా టాబ్లెట్‌లో మాత్రమే కంటెంట్‌ని చూడగలరు. అదనంగా, వీడియోలు 480p (SD) రిజల్యూషన్‌లో కనిపిస్తాయి. ఒకరు వీడియోలను కూడా డౌన్‌లోడ్ చేయగలరు. అయితే, ఇది ఒకేసారి ఒక ఫోన్ లేదా టాబ్లెట్‌లో మాత్రమే పనిచేస్తుంది.
నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ వివరాలు :
ఈ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ ఖరీదైనది. నెలకు రూ.199 చెల్లించాలి. అన్‌లిమిటెడ్ యాడ్ ఫ్రీ మూవీలు, టీవీ కార్యక్రమాలు, మొబైల్ గేమ్‌లకు యాక్సెస్‌ను కలిగి ఉంటుంది. వినియోగదారులు ఒకేసారి 1 సపోర్టు ఉన్న డివైజ్‌లలో కంటెంట్‌ను చూడగలరు.
అర్హత గల డివైజ్‌ల జాబితాలో టీవీలు, టీవీ స్ట్రీమింగ్ డివైజ్‌లు, మొబైల్ ఫోన్‌లు, టాబ్లెట్‌లు, మ్యాక్స్, విండోలు, క్రోమ్‌బుక్ కంప్యూటర్‌లు, కేబుల్ బాక్స్‌లు, వీడియో గేమ్ కన్సోల్‌లు వంటివి ఉన్నాయి. సింగిల్ సపోర్టు ఉన్న డివైజ్‌లలో వీడియో డౌన్‌లోడ్ ఒకేసారి అందుబాటులో ఉంటుందని గుర్తుంచుకోండి. మీరు 720p (HD) రిజల్యూషన్‌లో వీడియోలను చూడవచ్చు.
Read Also : Asus AI Laptops : భారత్‌లో అసూస్ కొత్త ఏఐ రెడీ ల్యాప్‌టాప్స్.. అద్భుతమైన ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?