Reliance Foundation : యువతకు నైపుణ్య శిక్షణ కోసం ‘రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ’

Reliance Foundation : ఈ అకాడమీని స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రాష్ట్ర మంత్రి, విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి ప్రారంభించారు.

Reliance Foundation : యువతకు నైపుణ్య శిక్షణ కోసం ‘రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ’

Reliance Foundation Skilling Academy launched

Reliance Foundation : ప్రముఖ రిలయన్స్ ఫౌండేషన్ రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీని ప్రారంభించింది. భారత
యువతను అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్‌కు సిద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అకాడమీని స్కిల్ డెవలప్‌మెంట్,
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రాష్ట్ర మంత్రి, విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి ప్రారంభించారు.

Read Also : Vivo Y37 Pro Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వివో Y37 ప్రో ఫోన్ ఇదిగో.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) సహకారంతో రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించిన ‘భవిష్యత్ ఉద్యోగాల కోసం యువతకు సాధికారత’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ఈ కొత్త అకాడమీని లాంఛనంగా ఆవిష్కరించారు.

ప్రభుత్వ, రాజకీయ, కార్పొరేట్ పరిరక్షణ, పరిశ్రమ, పౌర సమాజం, విద్యా రంగాల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. స్కిల్ బిల్డింగ్,
ఎక్స్పర్ట్ గైడెన్స్ ద్వారా ఫ్యూచర్ రెడీ కోర్సులను స్కిల్లింగ్ అకాడమీ అందిస్తుంది. పరిశ్రమల అనుసంధానంతో కెరీర్ డెవలప్మెంట్‌కు
చేయూతను అందించనుంది.

అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా జయంత్ చౌధరి మాట్లాడుతూ.. “యువతలో జీవితకాల అధ్యయనం అనే సంస్కృతిని
ప్రోత్సహించడమే లక్ష్యం. యువతను శక్తివంతం చేయాలనే ప్రధాని మోదీ విజన్‌‌కు అనుగుణంగా ఈరోజు ‘రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్
అకాడమీ’ ని ప్రారంభించడం చాలా సంతోషకరం. యువతకు 21వ శతాబ్దం నైపుణ్యాలను అందించనుంది” ఆయన అన్నారు.

రిలయన్స్ ఫౌండేషన్ సీఈఓ జగన్నాథ కుమార్ మాట్లాడుతూ.. “యువత ఆశయాలను నెరవేర్చడంలో సహకరించడం రిలయన్స్
ఫౌండేషన్ ప్రాథమిక లక్ష్యాల్లో భాగం. ఈ స్కిల్లింగ్ అకాడమీ యువతను భవిష్యత్ ఉద్యోగాలకు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది”
అని పేర్కొన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ (www.rfskillingacademy.com) ప్లాట్‌ఫామ్ అందరికీ
అందుబాటులో ఉంటుంది.

Read Also : Bajaj Allianz Life Insurance : ఏపీ, తెలంగాణలో వరద బాధిత పాలసీదారులు ఈజీగా క్లెయిమ్స్ చేసుకోవచ్చు..!