SSC CGL 2024 Admit Cards : దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థులకు ఎస్ఎస్‌సీ సీజీఎల్ అడ్మిట్ కార్డు విడుదల.. డౌన్‌లోడ్ లింక్ ఇదిగో..
SSC CGL 2024 Admit Cards : ఎస్ఎస్‌సీ దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థుల కోసం సీజీఎల్ పరీక్ష 2024 (టైర్ 1) కోసం అడ్మిట్ కార్డ్‌లను రిలీజ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SSC CGL 2024 Admit Cards : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) పరీక్ష 2024 (టైర్ 1) కోసం అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు తమ అడ్మిట్ కార్డ్‌లను ఎస్ఎస్‌సీ సదరన్ రీజియన్ అధికారిక వెబ్‌సైట్ (sscsr.gov.in) నుంచి ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎస్ఎస్‌సీ అనేక ఇతర ప్రాంతాలకు అడ్మిట్ కార్డ్‌లను క్రమంగా విడుదల చేస్తోంది. అందులో ఈశాన్య, ఉత్తర, పశ్చిమ, మధ్యప్రదేశ్, నార్త్ వెస్ట్రన్, సెంట్రల్ ఉన్నాయి. ఎస్ఎస్‌సీ సీజీఎల్ టైర్ 1 పరీక్ష సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 26, 2024 మధ్య జరగాల్సి ఉంది.
ఎస్ఎస్‌సీ సీజీఎల్ టైర్ 1 అడ్మిట్ కార్డ్ (సౌతరన్)ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? :
దక్షిణ ప్రాంత దరఖాస్తుదారులు తమ అడ్మిట్ కార్డ్‌లను ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ఎస్ఎస్సీ సదరన్ రీజియన్ వెబ్‌సైట్‌ను (https://sscsr.gov.in) సందర్శించండి
- హోమ్‌పేజీలో, “కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, 2024 – డౌన్‌లోడ్ ఇ-అడ్మిషన్ సర్టిఫికేట్” అనే లింక్ క్లిక్ చేయండి.
- కొత్త పేజీలో ఫీల్డ్‌లలో మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.
- “Submit” క్లిక్ చేయండి
- మీ SSC CGL టైర్ 1 అడ్మిట్ కార్డ్ డిస్‌ప్లే అవుతుంది.
- ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అడ్మిట్ కార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
ఏదైనా సమాచారం లేదా వివరణల కోసం అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ (https://ssc.nic.in)ను విజిట్ చేయొచ్చు.
Read Also : IIT Bombay Jobs : ఐఐటీ బాంబేలో భారీగా తగ్గిన ప్యాకేజీలు.. 25 శాతం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాల్లేవ్..!