Reliance Jio Anniversary : రిలయన్స్ జియో జైత్రయాత్రకు 8 ఏళ్లు.. భారత్‌లో 73 రేట్లు పెరిగిన డేటా వినియోగం!
Reliance Jio 8th Anniversary : రిలయన్స్ జియో రాకతో డేటా వినియోగంలో 2016లో భారత్ 155వ స్థానంలో నిలిచింది. తద్వారా దేశం నెంబర్‌వన్ ర్యాంకుకు చేరుకుంది. ఈ 8 ఏళ్ల కాలంలో దేశంలో డాటా వినియోగం 73 రేట్లు పెరిగింది.
Reliance Jio 8th Anniversary : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో 8వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 2016 సెప్టెంబర్‌లో ఆరంభమైన జియో అంచెలంచెలుగా విస్తరిస్తూ టెలికం మార్కెట్లో అగ్రాగామిగా ఎదిగింది. ఎప్పటికప్పుడూ సరికొత్త జనరేషన్ టెక్నాలజీని యూజర్లకు పరిచయం చేస్తూ ముందుకు సాగుతోంది.
అంతేకాదు, జియో రాకతో టెలికం పరిశ్రమలో అనేక విప్లవత్మాక మార్పులు వచ్చాయి. జీరో నుంచి 49 కోట్ల సబ్‌స్క్రైబర్ బేస్ చేరుకుంది జియో. సున్నా నుంచి 8శాతం వరకు అంతర్జాతీయ డేటా ట్రాఫిక్ పొందింది. దాంతో డేటా వినియోగంలో 2016 లో భారత్ 155వ స్థానంలో నిలిచింది. తద్వారా దేశం నెంబర్ వన్ ర్యాంకుకు చేరుకుంది. ఈ 8ఏళ్ల కాలంలో దేశంలో డాటా వినియోగం 73 రేట్లు పెరిగింది.
టెలికం మార్కెట్లో అగ్రగామిగా జియో :
మొదట్లోనే టెలికం మార్కెట్లో అనేక సంచలనాలను జియో నమోదు చేసింది. ప్రారంభంలో ఫ్రీ అన్‌లిమిటెడ్ కాల్స్, దేశవ్యాప్తంగా ఫ్రీ రోమింగ్ ప్రవేశపెట్టింది. వాయిస్ ఓవర్ ఎల్టీఈ (VoLTE) తీసుకొచ్చిన ఘనత జియోకే దక్కింది. సెల్ఫ్ కేర్ ప్లాట్‌ఫామ్, మైజియో యాప్ కూడా జియో ప్రవేశపెట్టింది.
Read Also : Infinix Hot 50 5G : భలే ఉంది భయ్యా.. ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫోన్ అదుర్స్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!
వై-ఫై కాలింగ్ ద్వారా కనెక్టివిటీ ఆప్షన్లను జియో మెరుగుపర్చింది. 4జీ ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్ కూడా తీసుకొచ్చింది. ఫుల్లీ క్లౌడ్, నేటివ్, సాఫ్ట్ వేర్, డిఫైన్డ్ డిజిటల్‌గా ఎండ్ టు ఎండ్ 5జి స్టాక్ ప్రవేశపెట్టింది. క్వాంటమ్ సెక్యూరిటీ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లను ఈ 5జి స్టాక్ సపోర్ట్ అందిస్తుంది. 4జీ మౌలిక వసతులపై ఆధారపడకుండానే దేశంలో 5జీ నెట్‌వర్క్ ఏర్పాటు చేసిన ఘనత కూడా జియోకే దక్కింది.
జియో కీలక మైలురాళ్లు :
జియో సర్వీస్ ప్రొడక్టులను ఏళ్ల తరబడిగా విస్తరిస్తోంది. 2023లో జియో బుక్, జియో భారత్, జియో ఎయిర్ ఫైబర్ ప్రవేశపెట్టింది. జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య కూడా భారీగానే పెరిగింది. 2024 ఆగస్టు నాటికి 49 కోట్ల మంది యూజర్లకు చేరుకుంది. అందులో 13 కోట్ల మంది 5జీ యూజర్లు. ఫలితంగా అనేక కీలక మైలురాళ్లతో జియో దూసుకుపోతోంది. 2022 జియో ట్రూ5జీతో పాటు 2021లో జియోఫోన్ నెక్ట్స్ వంటి అనేక సర్వీసులను తీసుకొచ్చింది.
జియో ఫైబర్ దేశంలో నంబర్ వన్ ఫైబర్ -టు-ది-హోమ్ (FTTH) ప్రొవైడర్ స్థాయికి చేరుకుంది. 2023-24 ఆర్థిక ఏడాదిలో ఈ నెట్‌వర్క్ 148.5 బిలియన్ జీబీ డేటా, 5.5 ట్రిలియన్ నిమిషాల వాయిస్‌ను డేటాను వినియోగించింది. ఆరంభంలోని తలసరి వినియోగంతో పోలిస్తే.. గణనీయ వృద్ధిని సాధించింది. 2016 ఏడాదిలో సగటు జియో యూజర్ 800ఎంబీ వాడగా, ఇప్పుడు నెలకు 30జీబీ వరకు విస్తరించింది.
జియో వ్యూహాత్మక కార్యక్రమాలివే :
జియో సంస్థ పేటెంట్ పోర్ట్ ఫోలియోను కలిగి ఉంది. ఇప్పటివరకూ 1,687 పేటెంట్లకు జియో దరఖాస్తు చేసింది. 2023-24 ఆర్థిక ఏడాదిలో దాఖలు చేసిన 1,255 దరఖాస్తులు ఇందులో ఉన్నాయి. 6జీ, ఏఐ, బిగ్ డేటా, ఐఓటీ వంటి కీలక సెక్టార్లకు సైతం పేటెంట్లు విస్తరించాయి. అంతర్జాతీయంగా అతిపెద్ద డేటా మార్కెట్‌గా భారత్ దూసుకెళ్తున్న తరుణంలో జియో నెట్‌వర్క్ అంతర్జాతీయ డేటా ట్రాఫిక్‌లో 8 శాతం వాటా, దేశీయ మొత్తం డేటా ట్రాఫిక్‌లో జియో 60 శాతం వాటాతో ముందుకు సాగుతోంది.
జియో తన మార్కెట్లో అగ్రస్థానంతో పాటు జైత్రయాత్రను కొనసాగిస్తోంది. దేశీయ 5జీ రేడియో కాల్స్ లో 85శాతం నెట్‌వర్క్ పరిధిలో ఆపరేట్ చేస్తోంది. 5జీ విభాగంలో కూడా జియో అదే దూకుడును కొనసాగించనుంది. అంతేకాదు.. భారీ స్థాయిలో ఏఐ మౌలిక వసతులను కూడా సమకూర్చుకుంటోంది. గిగావాట్ లెవల్ ఏఐ రెడీ డేటా సెంటర్స్ జామ్ నగర్‌లో ఏర్పాటు చేసింది. దీన్ని గ్రీన్ ఎనర్జీతో రన్ చేస్తోంది. జియో 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ విజన్ టెలికామ్‌ను దాటి విస్తరించింది. 100 మిలియన్ ఇళ్లను, 20 మిలియన్ల చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలను అనుసంధానించింది.