NEET PG 2024 : ఈ నెల 30న నీట్ పీజీ స్కోర్‌కార్డ్ రిలీజ్.. పూర్తి వివరాలు మీకోసం..!

NEET PG 2024 Scorecard : నీట్ పీజీ మొదటి షిఫ్ట్‌లో 1,14,276 మంది అభ్యర్థులకు గానూ 1,07,959 మంది హాజరు కాగా, రెండో షిప్టులో 1,14,264 మంది అభ్యర్థులకు గాను 1,08,177 మంది హాజరయ్యారు.

NEET PG 2024 : ఈ నెల 30న నీట్ పీజీ స్కోర్‌కార్డ్ రిలీజ్.. పూర్తి వివరాలు మీకోసం..!

NEET PG 2024 Scorecard To Be Released On August 30, Check Details

NEET PG 2024 Scorecard : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ – పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) 024 స్కోర్‌కార్డ్‌ను ఆగస్టు 30న విడుదల చేయనుంది. నీట్ స్కోర్‌కార్డులు అధికారిక వెబ్‌సైట్‌ (natboard.edu.in, nbe.edu.in)లలో అందుబాటులో ఉంటాయి.

Read Also : WhatsApp Passkeys : వాట్సాప్‌లో ప్రైవసీ ఫీచర్.. పాస్‌కీలతో త్వరలో చాట్ బ్యాకప్‌లను ఎన్‌క్రిప్ట్ చేసుకోవచ్చు..!

అలాగే ,ఆగస్టు 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. నీట్ పీజీని రెండు షిఫ్టుల్లో ఆగస్టు 11న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి 7 గంటల వరకు జరిగిన సెషన్లలో మొత్తం 2,28,540 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 170 నగరాల్లో 416 కేంద్రాల్లో నీట్ పరీక్షను నిర్వహించారు. నీట్ పీజీ 2024 స్కోర్‌కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఈ కింది విధంగా ప్రయత్నించండి.

  • అధికారిక వెబ్‌సైట్‌లకు (natboard.edu.in, nbe.edu.in) వెళ్లండి.
  • “డౌన్‌లోడ్ స్కోర్‌కార్డ్‌లు” అనే లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీరు కొత్త పేజీకి రీడైరెక్ట్ అవుతారు.
  • అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి.
  • మీ స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై వివరాలు కనిపిస్తాయి
  • వివరాలను వెరిఫై చేసుకోండి.
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేయండి.

మొదటి షిఫ్ట్‌లో 1,14,276 మంది అభ్యర్థులకు గానూ 1,07,959 మంది హాజరు కాగా, రెండో షిప్టులో 1,14,264 మంది అభ్యర్థులకు గాను 1,08,177 మంది హాజరయ్యారు. ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ లేదా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నీట్ పీజీ పరీక్ష నిర్వహించారు. వివిధ కేటగిరీలకు ప్రత్యేకమైన కట్-ఆఫ్ పర్సంటైల్‌లు ఉన్నాయి. జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం 50వ పర్సంటైల్ స్కోర్ చేయాలి.

జనరల్-పీడబ్ల్యుబీడీ (పర్సన్స్ విత్ బెంచ్‌మార్క్ డిజేబిలిటీస్) కేటగిరీలో ఉన్నవారు కనీసం 45వ పర్సంటైల్ సాధించాలి. ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీ కేటగిరీల అభ్యర్థులకు, ఈ కేటగిరీలలోని వైకల్యం ఉన్నవారితో సహా కటాఫ్ 40వ పర్సంటైల్‌గా అందిస్తుంది. ఈ కట్ ఆఫ్ పర్సంటైల్స్ వైద్య కోర్సుల్లో ప్రవేశానికి అర్హతను నిర్ణయిస్తాయి.

Read Also : PF Funds Withdraw : మీ పీఎఫ్ ఫండ్స్ విత్‌డ్రా చేసుకోవాలా? ఈ యాప్ ద్వారా ఈజీగా పూర్తి చేయొచ్చు..!