PF Funds Withdraw : మీ పీఎఫ్ ఫండ్స్ విత్‌డ్రా చేసుకోవాలా? ఈ యాప్ ద్వారా ఈజీగా పూర్తి చేయొచ్చు..!
PF Funds Withdraw : ఉమంగ్ (UMANG) యాప్ ద్వారా మీరు పీఎఫ్ విత్‌డ్రా సులభంగా పూర్తి చేయొచ్చు. ఈ యాప్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది.

How to easily withdraw your PF funds using the UMANG app
PF Funds Withdraw : మీ ప్రావిడెంట్ ఫండ్ (PF) సేవింగ్స్ విత్‌డ్రా చేసుకోవాలని అనుకుంటున్నారా? ఉమంగ్ (UMANG) యాప్ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా చాలా ఈజీగా ఉంటుంది. వివిధ ప్రభుత్వ సేవలకు యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఉద్యోగాలు మారుతున్నా లేదా పదవీ విరమణ కోసం ప్లాన్ చేస్తున్నా సరే ఈ ఉమంగ్ యాప్ ద్వారా మీ పీఎఫ్ విత్‌డ్రా పూర్తి చేయొచ్చు.
మీ స్మార్ట్‌ఫోన్‌లో కేవలం కొన్ని ట్యాప్‌లతో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఉమంగ్ యాప్ అనేక ప్రభుత్వ సేవలతో అనుసంధానమై ఉంటుంది. పీఎఫ్-సంబంధిత లావాదేవీలను పూర్తి చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
ఉమంగ్ యాప్ ద్వారా మీరు పీఎఫ్ విత్‌డ్రా సులభంగా పూర్తి చేయొచ్చు. ఈ యాప్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. దశల వారీ ప్రక్రియలో అనేక సూచనలు చేస్తుంది. డిజిటల్ టూల్స్ గురించి తెలియని వారు కూడా ఈజీగా విత్ డ్రా ప్రాసెస్ పూర్తి చేయొచ్చు.
రియల్ టైమ్ అప్‌డేట్స్, సేఫ్ లావాదేవీ ఫీచర్లతో యూఎమ్ఎఎన్ మీ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా మీ పీఎఫ్ నిధుల నిర్వహణ మొత్తం సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఇందులో ఈ ఉమంగ్ యాప్‌ని ఉపయోగించి మీ పీఎఫ్ ఫండ్‌లను విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌ను వీలైనంత సాఫీగా చేయడానికి కీలక ఫీచర్లను ట్రై చేయొచ్చు. ఉమంగ్ యాప్ ద్వారా పీఎఫ్ ఎలా విత్ డ్రా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఉమంగ్ (UMANG) యాప్‌కి వెళ్లి మీ ఆధార్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి.
- మీరు సైన్ ఇన్ చేసిన తర్వాత అందుబాటులో ఉన్న ఆప్షన్ల నుంచి ‘EPFO’ సర్వీసును ఎంచుకోండి.
- ఆ తర్వాత, ‘Raise Claim’పై క్లిక్ చేయండి.
- మీ UAN నంబర్, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీని ఎంటర్ చేయండి.
- మీరు చేయాలనుకుంటున్న విత్ డ్రా టైప్ ఎంచుకోండి. అవసరమైన వివరాలను పూర్తి చేయండి.
- మీ రిక్వెస్ట్ (Request) సమర్పించండి.
- మీరు మీ అభ్యర్థనను నిర్ధారిస్తూ ఒక రసీదు నెంబర్ అందుకుంటారు.