భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌కి ఎన్ని వేల కోట్ల రూపాయల నష్టమో తెలుసా?

అత్యధికంగా ఆర్అండ్‌కి రూ.2,164.5 కోట్ల నష్టం వచ్చిందని తెలిపింది.

భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌కి ఎన్ని వేల కోట్ల రూపాయల నష్టమో తెలుసా?

Heavy rains in AP

భారీ వర్షాల కారణంగా వరద విపత్తు తలెత్తడంతో ఆంధ్రప్రదేశ్‌కి రూ. 6880.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. ఈ మేర కేంద్ర సర్కారుకి వివరాలు పంపేందుకు ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. అత్యధికంగా ఆర్అండ్‌కి రూ.2,164.5 కోట్ల నష్టం వచ్చిందని తెలిపింది.

ఏ శాఖకు ఎంత నష్టం?

  • రెవెన్యూ శాఖకు రూ.750కోట్ల నష్టం
  • పశు సంవర్ధక శాఖకు రూ.11.58కోట్ల నష్టం
  • మత్స్య శాఖకు 157.86కోట్ల నష్టం
  • వ్యవసాయ శాఖ కు 301.34కోట్లు నష్టం
  • ఉద్యాన శాఖకు 39.95కోట్ల నష్టం
  • విద్యుత్ శాఖకు 481.28 కోట్లు
  • ఆర్ అండ్ బీ 2164.5కోట్లు
  • గ్రామీణ నీటి సరఫరా 75.59కోట్లు
  • పంచాయతీ రోడ్లు 167.55కోట్లు
  • నీటి వనరులు 1568.55కోట్లు
  • పురపాలన, అర్బన్ 1160కోట్లు
  • అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్ కు 2కోట్ల మేర నష్టం

Also Read: విజయవాడలో వరద విలయం.. ఇంకా జలదిగ్బంధంలోనే పలు కాలనీలు