Cattle Milking : పశువులకు పాలుతీయడంలో నైపుణ్యం అవసరమే!
పాడిపశువుల్ని పాలు పితికే ముందే పేడ వెయ్యనివ్వాలి. పాలు పితికే ప్రాంతాన్ని శభ్రంగా ఉంచుకోవాలి. పాలు తీసే ముందు పొదుగును మరీ చన్నీళ్ళతో కాకుండా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

Cattle Milking : రైతులకు పశుపోషణ ఎంతముఖ్యమో,పాలు తీయటం కూడా అంతే ముఖ్యం. పశువులకు పాలు తీసే సమయంలో తగిన మెళుకువలు పాటిస్తే ఉత్తమైన పాల దిగుబడులు పొందవచ్చు. పాలు పితికే ముందు, పాలు పితికిన తరువాత రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పశువైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
రైతులు తమ పశువుల పాలు పితకటానికి రెండు గంటల ముందుగా దాణాను తడిపి పశువులకు పెట్టాలి. పశువులు బెదిరిపోయే పరిస్ధితుల్లో కాకుండా నిశబ్ధం, ప్రశాంత వాతావరణంలో పాలు తీయటం మంచిది. బెదరటం వల్ల ఆడ్రినలిన్ హార్మోన్ ఉత్పత్తి అవ్వటం వల్ల పాలు పితకటానికి వీలు పడదు. పాలు పితకటానికి ముందుగా వెల్లుల్లి, ఉల్లి, క్యాబేజీ, సైలేజీ గడ్డి మేపకూడదు. వీటివల్ల పాల రంగు , రుచి, వాసన మారుతుంది.
తొలిగా పితికిన పాల్లలో రక్తపు చారలు గానీ, మరేవైనా మలినాలు ఉన్నాయోలేదో చూడాలి. తేడా కనిపిస్తే ఆ పాలను మిగతా పాలల్లో కలపకూడదు. 12 లీటర్ల వరకు పాలదిగుబడి ఇచ్చే పశువులకు పాలను రోజుకు రెండు సార్లు లేదంటే మూడుసార్లు పాలు తీయాలి. ప్రతిరోజు ఒకే వ్యక్తి, ఒకే సమయంలో , ఒకే ప్రదేశంలో పాలు పితకాలి. పాలు తీసే ప్రతిసారి చేతులు శుభ్రం చేసుకోవాలి. దూడను వదిలిన తరువాత పొదుగులో పాలు చేపిన తరువాత పొదుగును శుభ్రంగా నీటితో కడగాలి.
పాడిపశువుల్ని పాలు పితికే ముందే పేడ వెయ్యనివ్వాలి. పాలు పితికే ప్రాంతాన్ని శభ్రంగా ఉంచుకోవాలి. పాలు తీసే ముందు పొదుగును మరీ చన్నీళ్ళతో కాకుండా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. పొదుగు కడగటం వల్ల చేపు రావటంతోపాటు సూక్ష్మజీవులు నశించి పాలు కలుషితం కాకుండా ఉంటాయి. పొదుగు చన్నులను 2 నిమిషాలపాటు నెమ్మదిగా మర్ధన చేయాలి. పాలు పితకటాన్ని 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తిచేయాలి. అలస్యం చేస్తే ఆక్సిటోసిన్ హార్మోన్ ప్రభావం తగ్గి చేపు పోతుంది.
పాలను బొటన వేలు మడిచిగానీ గోరుతో నొక్కిగానీ, చన్నును కిందకు లాగుతూ పాలు తీయ్య కూడదు. పొదుగు చనుకట్లను పిడికిలి నిండుగా పట్టుకుని మాత్రమే పాలను తీయాలి. పాలను తీయడానికి చన్ను మొదట్లో ఒత్తిడి కలగజేసి తరువాత పిడికిలి బిగిస్తూ పాలను బయటకు పితకాలి. చేతులకు గోళ్ళను తొలగించుకోవాలి. చివరి పాలలో వెన్నశాతం అధికంగా ఉంటుంది. కాబట్టి ఆఖరి దారలతో సహా పూర్తిగా పితకాలి.
1Thirumala : జీడిపప్పు బద్దల తయారీ ప్రారంభించిన టీటీడీ ఈఓ ధర్మారెడ్డి
2Gopichand: పక్కా కమర్షియల్ నుండి మరో అప్డేట్
3PM Modi Hyderabad Visit : ముందే వచ్చిన మోదీ.. షెడ్యూల్ మారింది..!
4Bandi Sanjay: తెలంగాణలోమసీదులు తవ్వుదామా? శవాలు ఉంటే మీరు తీస్కోండీ..శివలింగాలుంటే మాకు ఇవ్వండి : ఓవైసీకి బండి సంజయ్ సవాల్
5shortest teenager: ప్రపంచంలో అత్యంత పొట్టి యువకుడు ఏ దేశస్తుడో తెలుసా? ఎలా ఎంపికయ్యాడంటే..
6Warangal : ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం-ఆపరేషన్ కోసం తల పైభాగం తొలగింపు..అతికించకుండానే డిశ్చార్జ్
7Major: పవన్ కోసం స్పెషల్.. పక్కా అంటోన్న మేజర్!
8సామాజిక న్యాయ భేరి మోగించిన వైసీపీ
9RBI New Guidelines : బంగారం దిగుమతులపై ఆర్బీఐ కొత్త రూల్స్.. వారికి మాత్రమేనట..!
10Vaani Kapoor: స్టన్నింగ్ లుక్స్‌తో వాణీ కపూర్ హాట్ పిక్స్!
-
Raviteja: రామారావు డ్యూటీ ఎక్కడం మరింత ఆలస్యం!
-
Revanth Letter PM Modi : ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..తెలంగాణ ప్రజలంటే ఎందుకంత చులకన?
-
NTR: కొరటాల కోసం ఎన్టీఆర్ మార్పులు..!
-
Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎదురుచూపులు తప్పవా..?
-
Minister KTR Davos : మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన..తెలంగాణకు పెట్టుబడుల వరద
-
Mahesh Babu: మహేష్ సినిమాలో నందమూరి హీరో.. ఇక బాక్సులు బద్దలే!
-
Supreme Court : సెక్స్ వర్కర్లను వేధించొద్దు.. మీడియా, పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం!
-
Murder : రూ.500 కోసం ప్రాణం తీశాడు