Paddy Cultivation : వరిలో ఎండాకు తెగులు నివారణ

ఎండు తెగులును తట్టుకునే అనేక సన్న రకాలను శాస్త్రవేత్తలు రూపొందించినప్పటికీ, బీపీటీ రకానికి మార్కట్లో వున్న డిమాండ్ దృష్ట్యా రైతులు రిస్కు తీసుకుని సాగుచేస్తున్నారు. దాని పర్యవసానమే ఈ తెగులు. బాక్టీరియా ఎండు తెగులును ఇంగ్లీషులో బాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అంటారు.

Paddy Cultivation : వరిలో ఎండాకు తెగులు నివారణ

endu thegulu

Paddy Cultivation : తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న వరిపైరులో బాక్టీరియా ఆకు ఎండుతెగులు ఉధృతమవుతుంది. ఈ తెగులును తట్టుకునే అనేక సన్న రకాలను శాస్త్రవేత్తలు రూపొందించినా… రైతులు ఇంకా సాంబామసూరి, హెచ్.ఎమ్.టి వంటి రకాలను అధికంగా సాగుచేయటం వల్ల తెగులును తట్టుకోలేని ఈ వంగడాలు బాక్టీరియాకు సులభంగా లొంగిపోతున్నాయి. వరిపైరు ఈనిక దశలో ఎండాకు తెగులు ఉధృతి వల్ల రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. బాక్టీరియా ఆకు ఎండు తెగులు లక్షణాలు, నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

READ ALSO : Protect Heart Health : మధుమేహాం సమస్యతో బాధపడుతున్న వారు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏంచేయాలంటే !

ఆకుల కొనలు ఎండిపోయి చేను మొత్త కళావిహీనంగా మారిపోయిన ఈ వరి క్షేత్రం బాక్టీరియా ఎండు తెగులు ఉధృతికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. పైరు ఈనిక దశలో ఈ తెగులు ఉధృతి వల్ల రైతు తీవ్రంగా నష్టపోయే ప్రమాధం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఈ రకం బీపీటీ – 5204 ( ఏభై రెండు సున్నా నాలుగు). అతి సన్న రకంగా పెరుగాంచిన హెచ్.ఎమ్.టి రకానికి కూడా ఈ తెగులు భారీగా సోకింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోను ఈ రెండు రకాలకు బాక్టీరియా ఎండు తెగులు సోకి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

READ ALSO : Kharif Rice Crop : ఖరీఫ్ వరి పంటలో చీడపీడల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఎండు తెగులును తట్టుకునే అనేక సన్న రకాలను శాస్త్రవేత్తలు రూపొందించినప్పటికీ, బీపీటీ రకానికి మార్కట్లో వున్న డిమాండ్ దృష్ట్యా రైతులు రిస్కు తీసుకుని సాగుచేస్తున్నారు. దాని పర్యవసానమే ఈ తెగులు. బాక్టీరియా ఎండు తెగులును ఇంగ్లీషులో బాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అంటారు. ఈ తెగులును తాత్కాలికంగా అదుపుచేయగలం తప్ప, పూర్తిస్థాయిలో నివారణ లేదు. చిరు జల్లులు, మంచు వాతావరణంలో ఈ తెగులు త్వరగా వ్యాపిస్తుంది. ఈ తెగులు లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. జె. హేమంత్ కుమార్ రైతాంగానికి తెలియజేస్తున్నారు.