Chikkudu Farming : చిక్కుడుతోటల్లో మారుకామచ్చల పురుగు బెడద.. నివారణ చర్యలు

చిక్కుడుకు మార్కెట్లో మంచి డిమాండ్ వుంది. పాదు జాతి చిక్కుడును సాగుచేయాలంటే ఖర్చు అధికం. పైగా పంటకాలం కూడా ఎక్కువ.

Chikkudu Farming : చిక్కుడుతోటల్లో మారుకామచ్చల పురుగు బెడద.. నివారణ చర్యలు

Chikkudu Farming

Chikkudu Farming : ఉభయ తెలుగు రాష్ట్రాలలో పండించే కూరగాయల పంటలలో చిక్కుడు ఒకటి. వీటిలో అనేక రకాలు ఉన్నప్పటికీ , పందిర్లు అవసరం లేని పొదచిక్కుడు సాగు విస్తీర్ణం అధికంగా వుంది.  ప్రస్తుతం ఈ పంట పూత, కాయ  దశల్లో వుంది. అయితే ఈ పంటకు చాలా చోట్ల మారుకా మచ్చల పురుగు ఆశించి తీవ్రనష్టం చేస్తోంది. తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పురుగును అరికట్టవచ్చంటూ, యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త, డా. అనూష.

READ ALSO : Dragon Fruit : అమెరికన్ బ్యూటీ డ్రాగన్ ఫ్రూట్ సాగు

చిక్కుడుకు మార్కెట్లో మంచి డిమాండ్ వుంది. పాదు జాతి చిక్కుడును సాగుచేయాలంటే ఖర్చు అధికం. పైగా పంటకాలం కూడా ఎక్కువ. దీంతో చాలా మంది రైతులు 120 నుండి 150 రోజుల్లో చేతికొచ్చే పొదచిక్కుడు లేదా చెట్టు చిక్కుడును అధికంగా సాగుచేస్తున్నారు. ఎకరానికి 4 నుండి 5టన్నుల దిగుబడినిచ్చే ఈ పంటలో పూత, పిందె దశ చాలా కీలకం.

READ ALSO : Trichoderma Viride : తెగుళ్లు రాకుండా అరికట్టే.. ట్రైకోడెర్మా విరిడె

ప్రస్తుతం చిరుజల్లులతో, వాతావరణం చల్లగా ఉండటంతో మారుకా మచ్చల పురుగు దాడి కనిపిస్తోంది. కొన్నితోటల్లో ఇప్పటికే ఇది ఉధృతంగా వున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ఆశించిన ప్రాంతాల్లో రైతులు జాగ్రత్తగా ఉంటూ, సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లైతే మంచి దిగుబడిని పొందే అవకాశం ఉంటుందని, తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త, డా. అనూష.

READ ALSO : Women’s Reservation Bill : కేంద్రం సంచలన నిర్ణయం.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం

రైతులు పురుగు మందులు పిచికారీని, ఉదయం, సాయంత్రం వేళల్లో చేపడితే ఈ పురుగును సమర్థంగా అరికట్టవచ్చు.మందు పిచికారి చేసిన వారం రోజుల వరకు చిక్కుడును కోయరాదు. పురుగు ఆశించిన కాయలను వేరుపరిచి నాణ్యమైన కాయలను మార్కెట్ చేసుకోవడం ద్వారా మంచి ధరను పొందేందుకు వీలుంటుంది.