సాహో : సెన్సార్ రిపోర్ట్

సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న సాహో.. సినిమా నిడివి 2 గంటల 51 నిమిషాల 52 సెకన్లు..

  • Published By: sekhar ,Published On : August 24, 2019 / 06:17 AM IST
సాహో : సెన్సార్ రిపోర్ట్

సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న సాహో.. సినిమా నిడివి 2 గంటల 51 నిమిషాల 52 సెకన్లు..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ మోస్ట్ అవైటెడ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్.. సాహో.. మరి కొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్ ఒక్కడే వివిధ ప్రాంతాలకు వెళ్తూ స్థానిక మీడియాతో సినిమా విశేషాలు పంచుకుంటున్నాడు. రీసెంట్‌గా సాహో సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి.

సినిమా చూసిన సెన్సార్ టీమ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా నిడివి 2 గంటల 51 నిమిషాల 52 సెకన్లు ఉందని, ఫస్ట్ హాఫ్ ఎంటర్ టైనింగ్‌గా ఉందని సెకండ్ హాఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయని, తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమానే కాక, బాహుబలి తర్వాత ప్రపంచ సినీ ప్రేక్షకులకు తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించే
సినిమా అవుతుందని తెలిపారు.

Read Also : బిగ్ బాస్ 3 : హస్‌లో రచ్చ రచ్చ చేసిన హిమజ..

తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో అత్యధిక థియేటర్లలో ఆగస్టు 30న సాహో గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమాటోగ్రఫీ : మది, ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్, వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ : కమల్ కణ్ణన్.