Kharif Crops : ఖరీఫ్ పంటలకు ముందస్తుగా భూములు సిద్ధం – వేసవి దుక్కులతో నేలకు సత్తువ 

పచ్చిరొట్ట పైర్ల పెంపకంతో భూసారం పెంచుకొని పెట్టుబడులు తగ్గించుకునే వీలుంది. ఖరీఫ్ పంలకు భూములను ఏవిధంగా సిద్ధం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Kharif Crops : ఖరీఫ్ పంటలకు ముందస్తుగా భూములు సిద్ధం – వేసవి దుక్కులతో నేలకు సత్తువ 

Kharif Crops

Updated On : May 19, 2024 / 3:01 PM IST

Kharif Crops : యాసంగి సీజన్‌ ముగిసింది. రైతులు సాగుచేసిన పంట ఉత్పత్తులు చేతికి వచ్చాయి. సాగు భూములు కూడా ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం వేసవి దుక్కులకు, భూసార పరీక్షలు చేయించుకోవడానికి ఇదే సరైనా సమయం. ముఖ్యంగా వేసవిదుక్కులు చేయడం వల్ల, వానకాలం పంటలో తెగుళ్లు, కలుపు మొక్కల నివారణకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాదు పచ్చిరొట్ట పైర్ల పెంపకంతో భూసారం పెంచుకొని పెట్టుబడులు తగ్గించుకునే వీలుంది. ఖరీఫ్ పంలకు భూములను ఏవిధంగా సిద్ధం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు 

వర్షాధారంపై అధారపడి భూములు సాగు చేసే రైతులు రానున్న ఖరీఫ్ కు ఇప్పటి నుండే సన్నధ్ధం కావాల్సిన అవసరం ఉంది. జూన్ నెల నుంచి అక్టోబరు వరకు సాగయ్యే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఈ కాలంలో పండే ప్రధానమైన పంటలు వరి, జొన్నలు, మొక్క జొన్న, పత్తి, చెరకు, నువ్వులు, సోయాబీన్, వేరుశనగ.

జూన్ మాసంలో రుతుపవనాలు వచ్చి వర్షాలు పడటం మొదలైన తరువాత నేలను సిద్ధం చేసుకునే కంటే ముందుస్తుగా.. నేలను పంటలు వేసుకునేందుకు అనువుగా సిద్ధం చేసుకోవటం మంచిది. మే మాసం భూములను దున్ని ఉంచుకోవటం మంచిది. ఖరీఫ్ పంట కు సిద్ధమవుతున్న రైతులు.. ప్రస్తుతం మెట్ట, మాగాణి భూముల్లో ఎలాంటి పనులు చేయాలో తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడిఆర్ డా. ఉమారెడ్డి.

Read Also : Rice Varieties for Kharif : ఖరీఫ్ సాగుకు అనువైన మధ్యస్థ సన్నగింజ వరి రకాలు