Rice Varieties for Kharif : ఖరీఫ్ సాగుకు అనువైన మధ్యస్థ సన్నగింజ వరి రకాలు

ప్రస్థుతం వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి  తెచ్చారు. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో వుండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి.

Rice Varieties for Kharif : ఖరీఫ్ సాగుకు అనువైన మధ్యస్థ సన్నగింజ వరి రకాలు

Rice Varieties for Kharif

Rice Varieties for Kharif : ఖరీఫ్ వరిసాగుకు రైతులు సన్నద్దమవుతున్నారు. రకాలను ఎంచుకుని, విత్తనాలు సమకూర్చుకునే  పనిలో వున్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ప్రస్థుతం ప్రాచుర్యంలో వున్న పాత రకాలకు ప్రత్యామ్నాయంగా అనేక కొత్త వరి వంగడాలను శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు. ముఖ్యంగా బిపిటికి ప్రత్యామ్నాయంగా  మధ్యస్థ సన్నగింజ రకాలు ఏవి.. వాటి గుణగణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also : Ground Nut Cultivation : తెలుగు రాష్ట్రాల్లో విస్తీరంగా వేరుశనగ సాగు.. పంటలో చీడపీడల నివారణ

తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ వరి దాదాపు  కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగవుతోంది. ప్రస్థుతం వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి  తెచ్చారు. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో వుండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి, అధిక దిగుబడినిచ్చే నూతన రకాలవైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని, సరైన సమయంలో సాగుచేస్తే ప్రతి కూల పరిస్థితులను  అధిగమించి 50 శాతం దిగుబడి సాధించినట్లే.

మిగతా 50 శాతం సాగులో మనం పాటించే యాజమాన్యం పై ఆధారపడి వుంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా వున్నా ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి రకాల ఎంపిక, సాగుచేసే సమయం, పంటకాల పరిమితి అనేవి వరిసాగులో  కీలకమైన విషయాలుగా పరిగణించాలని సూచిస్తూ, బిపిటి, సాంబమషూరి, సోనామషూరికి ప్రత్యామ్నాయ మధ్యస్థ సన్నగింజ వరి రకాలు .. వాటి గుణగణాల గురించి తెలియజేస్తున్నారు  రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. దామోదర్ రాజు.

బిపిటికి ప్రత్యామ్నాయ రకాలు జిగిత్యాల పరిశోధ స్థానం నుండి వెలువడ్డాయి. మంచి దిగుబడులను కూడా క్షేత్రస్థాయిలో నమోదు అవుతున్నాయి. వీటితో పాటు చౌడును తట్టుకునే రకాలు… బిపిటి గింజను పోలి.. అధిక వర్షాలు.. ఈదురు గాలులకు పడిపోకుండా ఉండేందుకు  పొట్టి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు