IPL 2024 : స్టేడియంలో డ్యాన్స్ చేసిన దినేశ్ కార్తీక్, మహమ్మద్ సిరాజ్.. వీడియో వైరల్

ఐపీఎల్ 2024 సీజన్ లో శనివారం రాత్రి ప్లేఆఫ్స్ బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది.

IPL 2024 : స్టేడియంలో డ్యాన్స్ చేసిన దినేశ్ కార్తీక్, మహమ్మద్ సిరాజ్.. వీడియో వైరల్

Dinesh Karthik and Mohammad Sirajuddin

Updated On : May 19, 2024 / 2:30 PM IST

RCB vs DC Match : ఐపీఎల్ 2024 సీజన్ లో శనివారం రాత్రి ప్లేఆఫ్స్ బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్లలో ఆర్సీబీని విజయం వరించింది. చివరి రెండు బాల్స్ కు 10 రన్స్ చేస్తే చెన్నై జట్టు ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశం ఉంది. సీఎస్కే బ్యాటర్ జడేజా క్రీజులో ఉన్నాడు. రెండు బాల్స్ కు పరుగులు రాబట్టడంలో జడేజా విఫలం కావడంతో ఆర్సీబీ జట్టు చెన్నైపై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ జట్టు ప్లే ఆప్స్ కు దూసుకెళ్లింది.

Also Read : IPL 2024 : మరీ ఇంత పిచ్చా..! అర్ధరాత్రి వేళ రోడ్లెక్కిన ఆర్సీబీ ఫ్యాన్స్.. బెంగళూరు వీధుల్లో రచ్చరచ్చ.. వీడియోలు వైరల్

ఆర్సీబీ విజయం తరువాత స్టేడియంలో ఆర్సీబీ ఫ్యాన్స్, ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. అద్భుత విజయం సాధించడంతో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, ఇతర జట్టు సభ్యులు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. మైదానంలో చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఈ సమయంలో మహ్మద్ సిరాజుద్దీన్, దినేశ్ కార్తీక్ లు డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు.

Also Read : RCB vs CSK : ఉత్కంఠ పోరులో బెంగళూరు విజయం.. పోరాడి ఓడిన చెన్నై.. ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ