IPL 2024 : మరీ ఇంత పిచ్చా..! అర్ధరాత్రి వేళ రోడ్లెక్కిన ఆర్సీబీ ఫ్యాన్స్.. బెంగళూరు వీధుల్లో రచ్చరచ్చ.. వీడియోలు వైరల్

మ్యాచ్ విజయం తరువాత మైదానం వద్దకు ఆర్సీబీ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆర్సీబీ టీం సభ్యుల బస్సు బయటకు వచ్చే వరకు ..

IPL 2024 : మరీ ఇంత పిచ్చా..! అర్ధరాత్రి వేళ రోడ్లెక్కిన ఆర్సీబీ ఫ్యాన్స్.. బెంగళూరు వీధుల్లో రచ్చరచ్చ.. వీడియోలు వైరల్

RCB Fans Celebrations

Updated On : May 19, 2024 / 11:26 AM IST

IPL 2024 RCB vs CSK Match :  అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్స్ కు చేరుకుంది. బెంగళూరు సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్  జట్టును 27 పరుగుల తేడాతో ఓడించింది. ఆర్సీబీ ప్లేఆప్స్ కు చేరుకోవడంతో ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవదులు లేకుండాపోయాయి. అర్ధరాత్రి వేళ రోడ్లపైకి వచ్చి ఆర్సీబీ ఫ్యాన్స్ సందడి చేశారు. రాత్రి 1.30 గంటల సమయంలో బెంగళూరు వీధుల్లో అభిమానులు పెద్ద సంఖ్యలో గుమ్మిగూడి సంబురాలు చేసుకున్నారు.

Also Read : IPL 2024 : సీఎస్కేపై విజయం తరువాత ఆర్సీబీ ప్లేయర్స్ సంబరాలు చూశారా? వీడియోలు వైరల్

మ్యాచ్ విజయం తరువాత మైదానం వద్దకు ఆర్సీబీ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆర్సీబీ టీం సభ్యుల బస్సు బయటకు వచ్చే వరకు అభిమానులు అక్కడే వేచిఉన్నారు. రాత్రి 1.30 గంటల సమయంలో ఆర్సీబీ బస్సు మైదానం లోపలి నుంచి హోటల్ రూంకు వెళ్లే సమయంలో రోడ్డుకు ఇరువైపులా అభిమానులు గుంపులు గుంపులుగా గుమ్మిగూడి ఆర్సీబీ ఆర్సీబీ అంటూ పెద్ద పెట్టున నినాదాలతో హోరెత్తించారు.

Also Read : Virat kohli : ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు.. ఆ జాబితాలో తొలి భారత్ క్రికెటర్ అతనే

ఆర్సీబీ అధికారిక ట్విటర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. దీనికి ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చారు. రాత్రి 1.30 గంటలు అయింది. అదే దీని ప్రత్యేకత. మాకు ప్రపంచంలోనే అత్యుత్తమ అభిమానులు ఉన్నారు. మేము గర్విస్తున్నాం అని రాశారు. మరోవైపు ఆర్సీబీ విజయం తరువాత బెంగళూరు, హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లోని వీధుల్లోకి ఆర్సీబీ ఫ్యాన్స్ చేరుకొని సంబురాలు చేసుకున్నారు. ఆర్సీబీ ఆర్సీబీ అంటూ కేరింతలు కొడుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.