20లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీ

  • Published By: vamsi ,Published On : May 12, 2020 / 03:29 PM IST
20లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీ

 

కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ పరిణామాలపై జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ.. ఎన్నో మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొన్న భారత్.. కరోనాను దీటుగా ఎదుర్కొంటోందని చెప్పిన మోడీ గత 4నెలలుగా కరోనాతో పోరాడుతున్నామని అన్నారు

యావత్ ప్రపంచంతో పాటు భారత్.. శక్తివంచన లేకుండా శ్రమిస్తోందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ క్రమంలోనే భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతలం చేసేందుకు భారీ ప్యాకేజిని ప్రకటించారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట రూ.20 లక్షల కోట్లతో ప్యాకేజిని ప్రకటించారు మోడీ. 21వ శతాబ్దం భారత్ దేనని, ఈ ప్యాకేజి అండగా మన దేశం మున్ముందు కూడా మరింత మెరుగైన ఆర్థిక పురోగతి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ ప్యాకేజి భారత్ జీడీపీలో 10 శాతం ఉంటుందని, దీనిని ప్రధానంగా వ్యవసాయం, కార్మికులు, కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమలపై ఖర్చు పెట్టనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు(13 మే 2020) వెల్లడిస్తారని మోడీ స్పష్టం చేశారు. విపత్తును కూడా అవకాశంగా మలుచుకున్నప్పుడే పురోగతి సాధించవచ్చునని అన్నారు ప్రధాని మోడీ.