Preminchoddu : ‘ప్రేమించొద్దు’ ట్రైలర్ చూశారా..? కాలేజీ అమ్మాయి ఇద్దర్ని ప్రేమిస్తే..
తాజాగా ప్రేమించొద్దు సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

Shirin Sriram Preminchoddu Movie Trailer Released
Preminchoddu Trailer : శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో.. అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రేమించొద్దు’. బస్తీల్లో సాగే నేపథ్యంతో తెలిసి తెలియని వయసులో చేసే లవ్ స్టోరీతో ఈ సినిమా రా అండ్ రస్టిక్ గా తెరకెక్కింది. ప్రేమించొద్దు సినిమాని పాన్ ఇండియా సినిమాగా 5 భాషల్లో నిర్మించారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజ్ చేశారు.
Also Read : Chiranjeevi – Ram Charan : ‘విశ్వంభర’ సెట్‌లో రామ్ చరణ్.. తండ్రి కొడుకుల మధ్య స్టార్ సినిమాటోగ్రాఫర్..
తాజాగా ఈ ప్రేమించొద్దు సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లోనే కథని చెప్పేసినట్లు తెలుస్తుంది. ఓ కాలేజీ చదివే అమ్మాయి ఒకర్ని తెలీకుండా ఒకర్ని ప్రేమించడం, ఈ సంగతి తెలిసి ఆ ఇద్దరు ఏం చేశారు? దీంతో పాటు కాలేజీ, స్కూల్స్ లో ఇప్పటి స్టూడెంట్స్ ఎలా ఉంటున్నారు అని చూపించబోతున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. మీరు కూడా ప్రేమించొద్దు ట్రైలర్ చూసేయండి..
https://www.youtube.com/watch?v=yzEy4BvU0Jc
ఇక ఈ ప్రేమించొద్దు సినిమా తెలుగు వెర్షన్ ని జూన్ 7న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అనంతరం తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.