గుంటూరులో 64th రైల్వే వారోత్సవాలు

  • Published By: veegamteam ,Published On : April 17, 2019 / 05:00 AM IST
గుంటూరులో  64th రైల్వే వారోత్సవాలు

గుంటూరు : రైల్వే వారోత్సవాన్ని ఘనంగా జరుపుకొనేందుకు గుంటూరు రైల్వే డివిజన్‌ రెడీ అయ్యింది. ఏప్రిల్ 17 మధ్యాహ్నం 3 గంటల నుంచి జిల్లా కేంద్రంలోని రైల్‌మహల్‌లో గుంటూరు రైల్వే 64వ రైల్వే వారోత్సవాన్ని ఘనంగా వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ వీజీ భూమా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఆ కార్యక్రమంలో ఆయన ప్రసంగించనున్నారు. అనంరతం విధుల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు  అవార్డులను ప్రదానం చేయనున్నారని ఏడీఆర్‌ఎంలు సీఎం రంగనాథ్‌, ఆర్‌ శ్రీనివాస్‌ పాల్గొంటారని సీనియర్‌ డీసీఎం డీ వాసుదేవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసామని వాసుదేవరెడ్డి తెలిపారు.

కాగా ఈ సందర్భంగా గుంటూరు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు డి.వాసుదేవరెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన ట్రైన్ నంబర్లను కూడా తెలిపారు. 07053 సికింద్రాబాద్‌ – కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు ఏప్రిల్ 18న రాత్రి 7.30 గంటలకు బయలుదేరుతుందని..ఈ ట్రైన్ రాత్రి 12.18కి సత్తెనపల్లి, 1 గంటకు గుంటూరుకు చేరుకుని 19వ తేదీ ఉదయం 7.20 గంటలకు కాకినాడకు చేరుకుంటుందన్నారు. అలాగే  07054 గల ట్రైన్ కాకినాడ – సికింద్రాబాద్‌ స్పెషల్ ట్రైన్ ఏప్రిల్ 21వ తేదీన రాత్రి 8.45 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి దాటాక 2.35కి గుంటూరు, 3.30కి సత్తెనపల్లి, 22 ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకొంటుంది. ఈ రైలులో ఒక ఏసీ టూటైర్‌, రెండు త్రీటైర్‌, ఒక ఏసీ టూ-కమ్‌-త్రీటైర్‌, 10 స్లీపర్‌క్లాస్‌, నాలుగు జనరల్‌ బోగీలుంటాయని సీనియర్‌ డీసీఎం తెలిపారు.