Boy Suicide : పబ్‌జీ గేమ్‌ ఓడిపోవడంతో బాలుడు ఆత్మహత్య

ఉదయం ఎంతకీ గదిలోనుంచి వెలుపలికి రాకపోవడంతో తండ్రి వెళ్లి చూశారు. ఫ్యాన్‌కు కొడుకు మృతదేహం వేలాడుతూ కనిపించడంతో ఆ తండ్రి సొమ్మసిల్లిపడిపోయాడు.

Boy Suicide : పబ్‌జీ గేమ్‌ ఓడిపోవడంతో బాలుడు ఆత్మహత్య

Suicide

boy suicide : మచిలీపట్నంలో పబ్‌జీ గేమ్ ఓ బాలుడి ప్రాణం తీసింది. పబ్‌జీ గేమ్‌ ఓడిపోయావని పిల్లలు హేళన చేయడంతో బాలుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మచిలీపట్నంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివసించే 16 ఏళ్ల ఊటుకూరు ప్రభు పబ్‌జీ గేమ్‌ ఓడిపోవడంతో ప్రభును ఇంట్లో పిల్లలు హేళన చేశారు. ఆ అవమానం తట్టుకోలేక రాత్రి వేరే గదిలో పడుకుంటానంటూ వెళ్లిపోయిన ప్రభు.. ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.

ఉదయం ఎంతకీ గదిలోనుంచి వెలుపలికి రాకపోవడంతో తండ్రి వెళ్లి చూశారు. ఫ్యాన్‌కు కొడుకు మృతదేహం వేలాడుతూ కనిపించడంతో ఆ తండ్రి సొమ్మసిల్లిపడిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. రోజూ అందరితో సరదాగా ఆడుకునే 16 ఏళ్ల ప్రభు ఆత్మహత్య చేసుకోవడంతో మచిలీపట్నం న్యూ హౌసింగ్ బోర్డు కాలనీవాసులు షాక్‌ అయ్యారు.

Boy Addict PUBG : పబ్‌ జీకి బానిసై నలుగురు కుటుంబసభ్యులను కాల్చిచంపిన బాలుడు

ఊటుకూరు ప్రభు మరణించాడని తెలుసుకున్న వెంటనే కాంగ్రెస్‌ కృష్ణా జిల్లా అధ్యక్షురాలు తాంతియాకుమారి శాంతిరాజ్‌ ఇంటికి వెళ్లారు. ప్రభు మృతదేహానికి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. 16 ఏళ్ల ప్రభు..కాంగ్రెస్‌కు చేసిన సేవలను తాంతియాకుమారి కొనియాడారు. చిన్నప్పటి నుంచి ఎంతో సరదాగా ఉండే ప్రభును విగతజీవిగా చూడలేకపోయానంటూ ఆవేదన చెందారు.