Boy Addict PUBG : పబ్‌ జీకి బానిసై నలుగురు కుటుంబసభ్యులను కాల్చిచంపిన బాలుడు

మైన‌ర్ బాలుడు ప‌బ్ జీ గేమ్‌కి బానిసయ్యాడు. తల్లి పలుమార్లు మందలించినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇదే విషయంపై కుమారుడి మీద నహిద్‌ మళ్లీ కోపం ప్రదర్శించింది.

Boy Addict PUBG : పబ్‌ జీకి బానిసై నలుగురు కుటుంబసభ్యులను కాల్చిచంపిన బాలుడు

Kill (1)

Updated On : January 29, 2022 / 9:23 AM IST

boy killed four family members : ఆన్‌లైన్‌లో పబ్జీకి బానిసైన ఓ బాలుడు తన కుటుంబ సభ్యులనే కడతేర్చాడు. తల్లి, సోదరుడితో పాటు ఇద్దరు సోదరీమణులను కాల్చిచంపాడు. ఈ దారుణ ఘటన పాకిస్తాన్‌లో జరిగింది. లాహోర్‌లోని కహ్నా ప్రాంతానికి చెందిన 45ఏళ్ల నహిద్‌ ముబారక్‌ హెల్త్‌ వర్కర్‌గా పని చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే భర్తతో విడిపోయి పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఆమెకు 22ఏళ్ల కుమారుడు తైమూర్‌, 17, 11 ఏళ్ల వ‌య‌సున్న ఇద్దరు కూతుళ్లతో పాటు మ‌రో మైన‌ర్ బాలుడు ఉన్నారు.

అయితే మైన‌ర్ బాలుడు ప‌బ్ జీ గేమ్‌కి బానిసయ్యాడు. తల్లి పలుమార్లు మందలించినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇదే విషయంపై కుమారుడి మీద నహిద్‌ మళ్లీ కోపం ప్రదర్శించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలుడు కప్‌బోర్డులోని తుపాకీ తీసుకొని తల్లితోపాటు సోదరుడు, ఇద్దరు సోదరీమణులను కాల్చి చంపాడు. అనంతరం తన కుటుంబాన్ని ఎవరో చంపారంటూ పొరుగింటివారికి తెలియజేశాడు.

Drugs Smuggler Tony : ఇంటర్నేషనల్‌ డ్రగ్స్‌ స్మగ్లర్‌ టోనీని కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు

వారు ఇచ్చిన సమాచారంతో మృతుల ఇంటికి చేరుకున్న పోలీసులు బాలుడిని విచారించారు. అయితే తనకేమీ తెలియదని, ఘటన జరిగినప్పుడు తాను ఇంటిపై ఉన్నానని బుకాయించాడు. అనుమానంతో పోలీసులు కాస్త గట్టిగా విచారించడంతో నిజం అంగీకరించాడు. హత్య చేసిన తర్వాత తుపాకీని మురికి కాలువలో పడేసినట్లు తెలిపాడు. పబ్జీకి బానిసైపోవడంతో బాలుడి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు పోలీసులు వెల్లడించారు.