Man Killed Girlfriend : పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెలపాడులో దారుణం జరిగింది. ప్రేమోన్మాది ఘాతుకాని పాల్పడ్డాడు. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతు కోసి చంపాడు. ప్రియురాలిపై పగ పెంచుకుని కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

Man Killed Girlfriend : పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది

man killed girlfriend

man killed girlfriend : గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెలపాడులో దారుణం జరిగింది. ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతు కోసి చంపాడు. ప్రియురాలిపై పగ పెంచుకుని కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆపై తానూ చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడలోని ఓ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న తపస్వికి బీ.టెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న జ్ఞానేశ్వర్ కు రెండేళ్ల క్రితం ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. రేండేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. అయితే ఇన్నాళ్లు సాఫిగా సాగిన వీరి ప్రేమలో అలజడులు మొదలయ్యాయి. కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి.

Boy Friend Attack : ప్రేమ పేరుతో ప్రియురాలిపై దాడి, దోపిడీ చేసిన ప్రియుడు

ప్రేమ విషయంల విబేధాలు రావడంతో అతనిపై కృష్ణా జిల్లాలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయినా అతని నుంచి ఇబ్బందులు ఎదురవుతుండటంతో తక్కెలపాడులో ఉంటున్న తన స్నేహితురాలికి చెప్పి తపస్వి బాధపడ్డారు. ఆమె తపస్వికి ధైర్యం చెప్పారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇద్దరిని తన ఇంటికి పిలిపించి మాట్లాడుతుండగా ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన జ్ఞానేశ్వర్ తన జేబులో నుంచి సర్జికల్ బ్లేడ్ తీసి ప్రియురాలు తేజస్విపై దాడి చేశారు.

ఆమె స్నేహితురాలు బయపడి పోయి కేకలు వేస్తూ పైఅంతస్తు నుంచి కిందికి దిగారు. ఇంటి యజమానికి చెప్పి అతన్ని పైకి తీసుకెళ్లే లోపే గది తలుపులు బిగించి అత్యంత దారుణంగా తపస్వినిపై జ్ఞానేశ్వర్ దాడికి పాల్పడ్డారు. ఎంత కేకలు చేసినా జ్ఞానేశ్వర్ తలుపులు తీయకపోవడంతో గ్రామస్తులు తలుపు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న బాధితురాలిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులు నిందితుడిని బంధించారు.

Kakinada Love Attack Incident : కాకినాడలో దారుణం.. ప్రేమించడం లేదని యువతిని వెంటాడి హత్య చేసిన ప్రేమోన్మాది

తాను వేరే యువకుడిని పెళ్లి చేసుకుంటున్నాని తపస్వి చెప్పడంతో జ్ఞానేశ్వర్ ఒక్కసారిగా దాడికి పాల్పినట్లు తెలిసింది. స్పృహ కోల్పోయిన తపస్విని గొంతుపై అదేపనిగా గాయపరచడం తీవ్ర రక్త స్రావం కావడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. జ్ఞానేశ్వర్ పథకం ప్రకారం తపస్విపై దాడి చేసి హత మార్చాడు.

అనంతరం నిందితుడు బ్లేడుతో తన చేతిని కోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోగా గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. నేరం జరిగిన ప్రదేశానికి ప్రేమికులకు ఎలాంటి సంబంధం లేదని పెదకాకాని సీఐ బండారి సురేష్ బాబు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు.