Deepavali Village : ఆ ఊరే ‘దీపావళి’.. ఈ గ్రామం ఎక్కడ ఉందో తెలుసా?
ఆ ఊరే దీపావళి.. దీపావళి అనగానే వెలుగులతో విరాజిల్లుతుందని అంటారు. దీపావళి అంటే ఇక్కడ పండుగ కాదు.. అది ఒక ఊరు అనమాట. పండుగల పేర్లతో గ్రామాల పేర్లు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.

A Villlage Named With Deepavali In Srikakulam District
Deepavali Village : ఆ ఊరే దీపావళి.. దీపావళి అనగానే వెలుగులతో విరాజిల్లుతుందని అంటారు. దీపావళి అంటే ఇక్కడ పండుగ కాదు.. అది ఒక ఊరు అనమాట. పండుగల పేర్లతో గ్రామాల పేర్లు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామానికి దీపావళి అని పేరుపెట్టారు. శ్రీకాకుళం పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామానికి దీపావళి అని పేరు పెట్టడానికి ఓ పెద్ద కథే ఉందని స్థానికులు చెబుతున్నారు. శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన ఓ రాజు ఈ గ్రామానికి దీపావళి పేరును పెట్టినట్టు స్థానికులు చెబుతున్నారు.
Read Also : Diwali Precautions : దీపావళి టపాసులు కాల్చటం సరే… జాగ్రత్తలు తప్పనిసరి!…
దీనికి సంబంధిం కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.. అదేంటంటే? శ్రీకాకుళాన్ని పరిపాలించిన రాజు కళింగపట్నం ప్రాంతానికి గుర్రంపై వచ్చే వాడట.. ఆయన ఇదే గ్రామం మీదు వెళ్లేవాడట. ఓ రోజున ఆయన ఎండ తీవ్రతను తట్టుకోలేక స్పృహ తప్పి కిందపడిపోయారట. అక్కడే సమీపంలో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలు రాజును గుర్తించి ఆయనకు మంచినీళ్లు తాగించి సపర్యలు చేశారట..
రాజు కోలుకున్న తర్వాత వారు చేసిన సపర్యలకు సంతోషించారట. తన ప్రాణాలను కాపాడిన గ్రామస్తులకు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. అదే రోజున దీపావళి కావడంతో ఆ గ్రామానికి ఆయన దీపావళిగా నామకరణం చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకూ రెవెన్యూ రికార్డుల్లోనూ ఆ గ్రామం పేరు దీపావళిగానే నమోదైంది. ఈ చిన్నగ్రామంలో ప్రస్తుతం వెయ్యి మంది జనాభా ఉన్నారట.
Read Also : Aadhaar Violators: ఆధార్ చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్పదు రూ.కోటి జరిమానా