AP Government: ఉపాధ్యాయులకు తిప్పలే..! ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆబ్సెంట్.. ఏపీలో టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ విధానం

ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయులకు ఇది బ్యాడ్ న్యూసే. స్కూల్ ఉదయం 9గంటలు అయితే ఓ అర్థగంట అటూఇటూగా వెళ్దాంలే అనుకుంటే ఇకనుంచి ఆ పప్పులుడకవ్.

AP Government: ఉపాధ్యాయులకు తిప్పలే..! ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆబ్సెంట్.. ఏపీలో టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ విధానం

facial recognition

AP Government: ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయులకు ఇది బ్యాడ్ న్యూసే. స్కూల్ ఉదయం 9గంటలు అయితే ఓ అర్థగంట అటూఇటూగా వెళ్దాంలే అనుకుంటే ఇకనుంచి ఆ పప్పులుడకవ్. ఖచ్చితంగా ఉదయం 9గంటలకు పాఠశాల ప్రాంగణంలో ఉండాల్సిందే. ఇందుకోసం టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని ఏపీ విద్యాశాఖ అమల్లోకి తేనుంది. ‘సిమ్స్ – ఏపీ’ అనే మొబైల్ యాప్ ను రూపొందించింది. ఉపాధ్యాయులు సహా పాఠశాలలో పనిచేసే అందరూ ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 9గంటల‌లోపు స్కూల్‌కు వచ్చి ఫోటో తీసుకుని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫొటోనే కదా ఎక్కడి నుంచైనా దిగేసి అప్‌లోడ్ చేయొచ్చు అనుకుంటే కదరదట. ఖచ్చితంగా పాఠశాలకు వచ్చిన తరువాతనే అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

CM YS Jagan: స్వాతంత్ర పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా: ఏపీ సీఎం జగన్

ఏపీలోని ఉపాధ్యాయులకు రేపటి నుంచి కొత్త హాజరు విధానం రాబోతుంది. ఇప్పటి వరకు బయో మెట్రిక్, ఐరిస్ హాజరు విధానం స్థానంలో ఫేషియల్ రికగ్నిషన్‌ను విద్యాశాఖ అమల్లోకి తేనుంది. దీనికోసం సిమ్స్ – ఏపీ అనే మొబైల్ యాప్ ను రూపొందించింది. ఉపాధ్యాయులు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఉదయం 9గంటలలోపే పాఠశాలకు వచ్చి ఫొటో తీసుకొని అప్ లోడ్ చేయాలి. ఉదయం 9గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా యాప్ తీసుకోదు. ఫలితంగా ఆబ్సెంట్ పడుతుంది. లీవ్ పెట్టుకోవాలని సూచిస్తుంది. అయితే ఫొటోనే కదా ఎక్కడి నుంచైనా తీసి అప్ లోడ్ చేద్దామంటే అలాకూడా ఈ యాప్ తీసుకోదు. జీపీఎస్ ఆధారంగా ప్రతి పాఠశాలను గుర్తిస్తారు. దీంతో ఎలాగైనా 9గంటల లోపు పాఠశాలకు వచ్చి పాఠశాల ఆవరణలోనే ఫొటో తీసుకోవాల్సి ఉంటుంది.

Prime Minister Modi: దేశానికి ఆ రెండు సమస్యలు చెదపురుగులా తయారయ్యాయి.. జనజీవనం నుంచి వాటిని తరిమేద్దాం

ఉపాధ్యాయులు సహా పాఠశాలల్లో పనిచేసే అందరూ ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. తొలుత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన లాగిన్‌లో పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. అనంతరం వారి ఫొటోలను మూడు యాంగిల్స్ తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆ తరువాత ఉపాధ్యాయులు యాప్ లోకి వెళ్లి పాఠశాలకు వచ్చిన వెంటనే ఫొటో దిగి అందులో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయాలంటే నెట్ సక్రమంగా అందుబాటులో ఉండాలి. పట్టణ ప్రాంతాలు, పట్టణాలకు సరిహద్దు ప్రాంతాల్లో అయితే ఇబ్బంది ఉండదు. కానీ మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయులకు ఈ యాప్ ద్వారా ఇబ్బందులు తప్పవన్న వాదన వినిపిస్తోంది. అయితే సిమ్స్- ఏపీ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవద్దని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ప్యాప్టో) ఉపాధ్యాయులకు సూచించింది. ఏపీ విద్యాశాఖ మాత్రం రేపటి నుంచే దీనిని అమల్లోకి తెస్తామని చెబుతోంది. మొత్తానికి ఏపీ విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంతో పాఠశాలలకు ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు ఇక నుంచి తిప్పలు తప్పనట్లే.