CM YS Jagan: స్వాతంత్ర్య పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా: ఏపీ సీఎం జగన్

జాతీయ జెండా మనదేశ స్వాతంత్ర్యానికి, అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక అన్నారు ఏపీ సీఎం జనగ్ మోహన్ రెడ్డి. ఏపీ, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం జరిగిన 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు.

CM YS Jagan: స్వాతంత్ర్య పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా: ఏపీ సీఎం జగన్

CM YS Jagan: దేశ స్వాతంత్ర్య పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా అని, ఇది మన భారతీయుల గుండె అని అభివర్ణించారు ఏపీ సీఎం జనగ్ మోహన్ రెడ్డి. ఏపీ, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం జరిగిన 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు.

Independence Day 2022: పిన్‌కోడ్‌కు నేటితో యాభై ఏళ్లు.. ఎలా మొదలైందో తెలుసా?

అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత వివిధ శాఖల ఆధ్వర్యంలో జరిగిన శకటాల ప్రదర్శనను తిలకించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘జాతీయ జెండా మనదేశ స్వాతంత్ర్యానికి, అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక. సార్వభౌమత్వానికి, ఏకత్వానికి, దేశభక్తికి, మన ఆత్మగౌరవానికి ప్రతీక. తమ భావాలు వేరైనా నాటి పోరాట యోధులు దేశ స్వాతంత్ర్యం కోసం ఒక్కటిగా పోరాడారు. వాళ్లను స్మరించుకుంటూ.. హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిన అవసరం ఉంది. అహింసే ఆయుధంగా, సత్యమే సాధనంగా సాగిన శాంతియుత పోరాటం మనది. ఇది ప్రపంచ మానవాళికి మహోన్నత చరిత్రగా నిలిచే ఉంటుంది. 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించింది. ప్రపంచంతో పోటీ పడి మరీ ప్రగతి సాధిస్తోంది’’ అన్నారు.

Delhi: బాలీవుడ్ మూవీ స్ఫూర్తితో దోపిడీ.. ముంబై పోలీసులమని చెప్పుకొని ఢిల్లీలో మోసం

అనంతరం ఏపీ సాధించిన ప్రగతి గురించి వివరించారు. ‘‘మూడేళ్లలో 40 వేల కొత్త ఉద్యోగాలు ఇవ్వగలిగాం. అనేక పాలనా సంస్కరణలు తీసుకొచ్చాం. పౌర సేవల్లో మార్పు తీసుకొచ్చాం. ప్రతీనెలా ఒకటో తేదీనే ఇంటివద్దకే పింఛన్‌ ఇస్తున్నాం. విత్తనం కొనుగోలు దగ్గర్నుంచి పంట అమ్మకం వరకూ ఆర్‌బీకేల ద్వారా సేవలు అందిస్తున్నాం. అన్నం పెట్టే రైతన్నకు రైతు భరోసా అందిస్తున్నాం. రైతు సంక్షేమానికి ఇప్పటివరకు రూ.1.27 లక్షల కోట్లు ఖర్చు చేశాం. అమ్మ ఒడితో చదువుకు భరోసా కల్పించాం. ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నా వడ్డీకే పంట రుణాలు అందిస్తున్నాం. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్ద పీట వేశాం. నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేశాం. 50 శాతం మహిళలకు రిజర్వేషన్‌ కల్పించిన ప్రభుత్వం మనది’’ అని సీఎం జగన్ వివరించారు.