ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు.. గొడుగులతో క్యూలైన్‌లో వేచి ఉన్న మందుబాబులు

  • Published By: srihari ,Published On : May 6, 2020 / 07:11 AM IST
ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు.. గొడుగులతో క్యూలైన్‌లో వేచి ఉన్న మందుబాబులు

ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. మూడో రోజు మద్యం అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. విశాఖ జిల్లాలో భౌతిక దూరం నిబంధనకు పోలీసులు చెక్ పెట్టారు. మద్యం కోసం వచ్చే వారికి గొడుగు, మాస్క్ తప్పనిసరి చేశారు. కొత్తగా గొడుగు దూరాన్ని ప్రవేశ పెట్టారు. క్యూలైన్ లో నిల్చున్నప్పుడు ఒక గొడుగు మరొక గొడుగుకు తగలకుండా ఉండేలా దూరం పాటించాలని నిబంధన విధించారు. 

రాష్ట్రవ్యాప్గంగా మద్యం ధరలు పెరిగాయి. రోజుకో ట్విస్టులతో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మొదటి రోజు 25 శాతం మద్యం అమ్మకాలు ప్రారంభించారు. ఆలస్యంగా మొదలయ్యాయి. రెండో రోజు కూడా మద్యం అమ్మకాలు యథావిధిగా కొనసాగుతాయన్న నేపథ్యంలో ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. మరో 55 శాతం ధరలు పెంచి మొత్తం 75 శాతం ధరలతో నిన్న మధ్యాహ్నం నుంచి మద్యం అమ్మకాలను ప్రారంభించారు. 

ఈరోజు ఉదయం నుంచి యథావిధిగా మద్యం అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. కానీ గొడుగు, మాస్క్ ఉంటేనే మద్యం ఇవ్వాలని జిల్లాల సీపీలు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే భౌతికదూరం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. పోలీసులకు కూడా కొంత సవాల్ గా మారింది. ఎవరూ కూడా భౌతిక దూరం పాటించకపోవడం ఒక పెద్ద సమస్యగా మారింది. ఎంట కంట్రోల్ చేసినప్పటికీ మందుబాబులు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు.

ఈ క్రమంలో భౌతిక దూరం పాటించేందుకు గొడుల ప్లాన్ అనేది తీసుకొచ్చారు. గొడుగు ఉంటేనే భౌతిక దూరం అనేది కంట్రోల్ లో వస్తుందని భావించిన పోలీసులు గొడుగులు కచ్చితంగా వేసుకరావాలని ఆదేశించారుు. ఎండలు  విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో గొడుగుల కచ్చితంగా అత్వవసరం అయ్యాయి. మద్యం తీసుకోవడానికి గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. దీనికి కోసం గొడుగుల అవసరం ఎక్కువగా ఉంది.

Also Read | ఏపీ @ 1777, కొత్తగా 60 కరోనా కేసులు