Electric Shock Elephant Died : తొండంతో బోరు మీటర్ ను లాగిన ఏనుగు.. విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి
చిత్తూరు జిల్లాలో విద్యుత్ షాక్ తో ఏనుగు మృతి చెందింది. జిల్లాలోని బంగారుపాళ్యంలో పొలంలో బోరు మీటర్ ను తొండంతో లాగడంతో విద్యుత్ షాక్ తగిలి ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది.

elephant died
Electric Shock Elephant Died : చిత్తూరు జిల్లాలో విద్యుత్ షాక్ తో ఏనుగు మృతి చెందింది. జిల్లాలోని బంగారుపాళ్యంలో పొలంలో బోరు మీటర్ ను తొండంతో లాగడంతో విద్యుత్ షాక్ తగిలి ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
ఏనుగు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కళేబారాన్ని ఖననం చేయనున్నారు.
గత కొన్నిరోజులుగా జిల్లాలో ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ఏనుగులు రోడ్లపైకి వస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.
Chittoor: విద్యుత్ షాక్‌తో గజరాజు మృతి.. అక్కడే తిష్ట వేసిన ఏనుగుల గుంపు!
ప్రధానంగా ఏపీ, తమిళనాడు సరిహద్దు అటవీప్రాంతాల నుంచి ఏనుగులు గ్రామాలకు వస్తున్నాయి. దీంతో తమకు ఎలాంటి ప్రమాదం జరుగకుండా ఏనుగులపై ప్రత్యేక నిఘా ఉంచి అటవీ ప్రాంతంలోకి వాటిని తిరిగి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.