Andhra Pradesh : రేపటి నుంచి హాట్ హాట్‌‌గా ఏపీ అసెంబ్లీ..

పోలవరం, రైతాంగ సమస్యలపై నిలదీయాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. సభ స్టారింగ్ లోనే.. టీడీపీ ఆందోళనలు చేపట్టి.. రానున్న రోజుల్లో...

Andhra Pradesh : రేపటి నుంచి హాట్ హాట్‌‌గా ఏపీ అసెంబ్లీ..

Ap Assembly

Andhra Pradesh Assembly : ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగనున్నాయి. 2022, మార్చి 07వ తేదీ సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ సమావేశాలకు అధికారపక్షం సిద్ధమవగా… మూడు రాజధానులు, వైఎస్ వివేకా హత్య కేసు లక్ష్యంగా ప్రభుత్వాన్ని కడిగిపారేయాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో మరోసారి అధికార, ప్రతిపక్షం మధ్య విమర్శలు తారాస్థాయికి చేలరేగనున్నాయి. రాజధాని అంశంలో హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామంటోంది.

Read More : Andharpradesh : ఏపీ అసెంబ్లీలో రచ్చ స్టార్ట్.. టీడీపీ ఆందోళనలు, నినాదాలు

రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు చట్ట పరిధిలోకి రాదని, వీటిపై చట్టాలు చేసే హక్కు శాసనసభకు లేదని తీర్పునివ్వడంపై వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ అంశాన్ని సభలో లేవనెత్తాలని వైసీపీ సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం. కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించాలని, దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని గట్టిగా పట్టుబట్టాలని టీడీపీ సభ్యులు యోచిస్తున్నారు. అంతేగాకుండా పోలవరం, రైతాంగ సమస్యలపై నిలదీయాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. సభ స్టారింగ్ లోనే.. టీడీపీ ఆందోళనలు చేపట్టి.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పకనే చెప్పింది. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని వెల్ లోకి దూసుకొచ్చి బడ్జెట్ ప్రతులను చింపి విసిరేశారు. అనంతరం బాయ్ కాట్ చేస్తూ వెళ్లిపోయారు. శాసనసభా సమావేశాలకు హాజరు కావాలా ? వద్దా ? అనే దానిపై టీడీపీ నిర్ణయం తీసుకోంది.

Read More : ఇటీవల ఆల్కహాల్ ని ప్రమోట్ చేసిన సౌత్ హీరోయిన్స్

సమావేశాలకు హాజరయితేనే కరెక్టు అనే అభిప్రాయానికి వచ్చారు. అయితే… టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం హాజరు కావడం లేదు. వైసీపీ ప్రభుత్వం తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తోందని, సీఎం అయ్యాకే తాను సభలో అడుగు పెడుతానని శపథం చేసి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. రెండో రోజు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఉభయసభలు సంతాపం తెలియచేసింది. అనంతరం సమావేశం వాయిదా పడింది. మార్చి 11వ తేదీన అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతారు. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి కన్నబాబు ప్రవేశపెడుతారు.