Andhra Pradesh Gold Mines : ఆంధ్రాలో మరో KGF.. ఏపీలో 5 బంగారు గనులను వేలం వేయనున్నకేంద్రం

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్.. KGF.. వరల్డ్ ఫేమస్.. ఇప్పుడు అలాంటి కీర్తి AGF.. ఆంధ్రా గోల్డ్ ఫీల్డ్స్ కు దక్కబోతోంది. ఇప్పటికే ఏపీలో పది గనులకు టెండర్లు పిలిచింది. దీంతో ఏపీలో మళ్లీ బంగారం తవ్వకాలు ప్రారంభం కానున్నాయి.

Andhra Pradesh Gold Mines : ఆంధ్రాలో మరో KGF.. ఏపీలో 5 బంగారు గనులను వేలం వేయనున్నకేంద్రం

Andhra Pradesh Gold Mines : కోలార్ గోల్డ్ ఫీల్డ్స్.. KGF.. వరల్డ్ ఫేమస్.. ఇప్పుడు అలాంటి కీర్తి AGF.. ఆంధ్రా గోల్డ్ ఫీల్డ్స్ కు దక్కబోతోంది. ఇప్పటికే ఏపీలో పది గనులకు టెండర్లు పిలిచింది. దీంతో ఏపీలో మళ్లీ బంగారం తవ్వకాలు ప్రారంభం కానున్నాయి.

ఆదాయం పెంచుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ఏపీలోని అనంతపురం జిల్లాలో ఉన్న బంగారం నిక్షేపాలు ఉన్న గనులను వేలం వేసేందుకు నిర్ణయించింది. అనంతపురం జిల్లాలో ఐరన్, బాక్సైట్ తో పాటు బంగారు నిక్షేపాలు కూడా భారీగా ఉన్నట్లు గతంలోనే సైంటిస్టులు గుర్తించగా ఏకంగా 10 చోట్ల బంగారం తవ్వుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం.

అనంతపురం జిల్లాలోని రామగిరి నార్త్ బ్లాక్, రొద్దం మండలంలోని బొక్సంపల్లి నార్త్ ప్లాంట్, బొక్సంపల్లి సౌత్ బ్లాక్, కదిరి మండలంలోని జవకుల -ఎ, జవకుల-బి, జవకుల -సి, జవకుల-డి, జవకుల-ఒ, జవకుల-ఎఫ్ లను వేలం వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వీటిలో 5 గనులకు ఈ నెల 26న, మిగతా ఐదింటికి 29న వేలం నిర్వహించనున్నారు.

అనంతపురం గోల్డ్ మైన్స్ ది పెద్ద చరిత్రే. 1921లో టిప్పు సుల్తాన్ కాలంలోనే అప్పటి బ్రిటీష్ పాలకులు రామగిరి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. 1973లో రామగిరి ప్రాంతంలోని దొడ్డ బురుజు పేరుతో బంగారు నిక్షేపాలను వెలికితీసేందుకు తొలిసారి ఇక్కడ మైనింగ్ చేశారు. అప్పుడు టన్ను మట్టిలోంచి 20గ్రాముల బంగారాన్ని వెలికితీశారు.

ఇక 1984లో కర్నాటకలోని కోలార్ జిల్లాకు చెందిన కర్నాటక గోల్డ్ ఫీల్డ్ కంపెనీ రామగిరిలో భారత్ గోల్డ్ మైన్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఇక్కడ మైనింగ్ ప్రారంభించారు. అలా ఏడాదికి 120 కిలోల బంగారం చొప్పున 17ఏళ్ల పాటు బంగారం వెలికితీశారు. రామగిరి ప్రాంతంలో 20 చోట్ల బంగారం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించి కేవలం నాలుగు చోట్ల మాత్రమే బంగారం వెలికితీశారు. 2001లో రామగిరిలో తవ్వకాలు నిలిపేశారు. అనంతలో ఇంకా 16టన్నుల దాకా బంగారం నిక్షేపాలు ఉన్నట్లు సైంటిస్టులు తేల్చారు. దీంతో మరోసారి గనుల తవ్వకానికి అనుమతి ఇచ్చింది కేంద్రం.

రామగిరి మైన్స్ కు సమీపంలో రెండు చోట్ల, రొద్దం మండలం బొక్సంపల్లిలో రెండు చోట్ల, కదిరి మండలంలోని జౌకుల పరిధిలో ఆరు చోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నాయి. ఈ పది ప్రాంతాల్ల 97.4 చదరపు కిలోమీటర్ల పరిధిలో బంగారు నిల్వలు ఉన్నాయి. 50మీటర్ల నుంచి కిందకు వెళ్లే కొద్దీ బంగారం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు సైంటిస్టులు. టన్ను మట్టిలో 4గ్రాముల బంగారం ఉంటుందని, జౌకులలోని ఆరు ప్రాంతాల్లో కలిపి మొత్తం 10 టన్నులు, రామగిరిలో 4 టన్నులు, బొక్సంపల్లిలో 2 టన్నులు.. మొత్తంగా 16 టన్నుల బంగారం నిల్వలు ఉంటాయని అంచనా వేశారు సైంటిస్టులు.

రామగిరి ప్రాంతంలో మట్టిని నమ్ముకుంటే బంగారం దొరుకుతుందని అక్కడి ప్రజలు చెబుతుంటారు. వందల ఏళ్ల పాటు తవ్వినా తరిగిపోని బంగారు నిల్వలు ఉన్నాయని గతంలో చెప్పారు భారత్ గోల్డ్ మైన్ కంపెనీ ఉద్యోగులు. వెంటనే ఇక్కడ మైనింగ్ ప్రారంభిస్తే పసిడి పంట పండటం ఖాయం అని చెప్పారు. దీంతో ఇప్పుడు కేంద్రం కూడా వీటిని లీజుకి ఇచ్చేందుకు ముందడుగు వేయడంతో పసిడి వర్షం కురిసే అవకాశం ఉంది. స్థానికంగానూ ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.