Ap Teachers Attendance : ఏపీలో ప్రభుత్వ టీచర్ల అటెండెన్స్ కష్టాలు.. టైమ్ కు వెళ్లినా.. పనిచేయని నెట్ వర్క్ తో ఇబ్బందులు

ఏపీలో ప్రభుత్వ టీచర్లకు పెద్ద కష్టమే వచ్చిపడింది. ఈరోజు నుంచి ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ విధానం అమల్లోకి తీసుకు వచ్చింది. కానీ నెట్ వర్క్ ప్రాబ్లమ్ తో టీచర్లకు తిప్పలు వచ్చిపడ్డాయి. ఏపీ వ్యాప్తంగా పలుప్రాంతాల్లో నెట్ వర్క్ ప్రాబ్లమ్ తో టీచర్లు అటెండెన్స్ కోసం తెచ్చిన ఏపీ సిమ్స్ యాప్ సరిగా పనిచేయకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Ap Teachers Attendance : ఏపీలో ప్రభుత్వ టీచర్ల అటెండెన్స్ కష్టాలు.. టైమ్ కు వెళ్లినా.. పనిచేయని నెట్ వర్క్ తో ఇబ్బందులు

Ap Teachers Attendance

Ap Teachers Attendance : ఏపీలో ప్రభుత్వ టీచర్లకు పెద్ద కష్టమే వచ్చిపడింది. ఈరోజు నుంచి ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ విధానం అమల్లోకి తీసుకు వచ్చింది. కానీ నెట్ వర్క్ ప్రాబ్లమ్ తో టీచర్లకు తిప్పలు వచ్చిపడ్డాయి. ఏపీ వ్యాప్తంగా పలుప్రాంతాల్లో నెట్ వర్క్ ప్రాబ్లమ్ తో టీచర్లు అటెండెన్స్ కోసం తెచ్చిన ఏపీ సిమ్స్ యాప్ సరిగా పనిచేయకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే టైమ్ కు టీచర్లకు అటెండెన్స్ పడకుంటే ఈరోజు జీతం కట్ అంటూ హుకుం జారీ చేసింది జగన్ సర్కార్. దీంతో నెట్ వర్క్ లేకపోవటంతో వారు స్కూల్ కు టైమ్ కు హాజరు అయినా అటెండెన్స్ పడక నానా ఇబ్బందులు పడుతున్నారు.

అటెండెన్స్‌కు ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆఫ్ డే లీవ్‌గా పరిగణిస్తామని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయటంతో పాపం ఉపాధ్యాయులకు ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది. అటెండెన్స్ యాప్‌ను వినియోగిస్తుంటే.. క్యాప్చా ఎర్రర్ అని చూపిస్తుందని వాపోతున్నారు. కొన్ని చోట్ల నెట్‌వర్క్ సమస్య.. సాంకేతిక సమస్యలు, డౌన్‌లోడ్, అప్‌లోడ్ సమస్యలు ఉన్నాయని వాపోతున్నారు. దీంతో ఈ యాప్ విధానంపై టీచర్లు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. దీన్ని తీసివేయాలను డిమాండ్ చేస్తున్నారు. ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఉదయం తొమ్మిది గంటలకల్లా స్కూల్ ఆవరణలోనే ఫోటో దిగాలి.. ఆ ఫోటోను విద్యాశాఖకు పంపించాలి. కానీ ఉపాధ్యాయులు స్కూల్ కు టైమ్ కే వచ్చినా ఫోటో దిగినా..నెట్ వర్క్ ప్రాబ్లమ్ వల్ల దాన్ని ఫార్వాడ్ చేయటంలో ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో ఆరోజు వారికి ఆఫ్ సెంట్ పడుతుందని వాపోతున్నారు. ఉదయం 8-30 నిమిషాలకు ముందే పాఠశాలలకు చేరుకుని ఆన్‌లైన్ అటెండెన్స్ వేద్దామని ప్రయత్నం చేస్తూనే ఉన్నామని.. సర్వర్ బిజీ, టైం అవుట్ అని వస్తుండటంతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం మాత్రం ఉపాధ్యాయులకు యాప్ ఆధారిత హాజరును విద్యాశాఖ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. టీచర్లు ఉదయం 9గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా సగం రోజు సెలవుగా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఉపాధ్యాయులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ విధానాన్ని ఫాలో అవ్వాలని ఆదేశించారు. కానీ మొదటి రోజే సమస్యలు ఎదురయ్యాయని టీచర్లు వాపోతున్నారు. పట్టణప్రాంతాల్లో కూడా నెట్ వర్క్ సరిగా లేదు. ఇక గ్రామాల్లో పనిచేసే టీచర్ల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఏమాత్రం నెట్ వర్క్ పనిచేయక నానా పాట్లు పడుతున్నారు.