Andhra Pradesh MLC Election 2023 : ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ‘టీడీపీ గెలిచినా’అంటూ వైసీపీ నేత తోట సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ‘టీడీపీ గెలిచినా’..అంటూ వైసీపీ నేత తోట సంచలన వ్యాఖ్యలు చేశారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించటంతో వైసీపీ షాక్ అయ్యింది. విజయానందంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తామే గెలుస్తామని ధీమాగా ఉంది. ఈక్రమంలో తోట చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

Andhra Pradesh MLC Election 2023 : ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ‘టీడీపీ గెలిచినా’అంటూ వైసీపీ నేత తోట సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh MLC Election 2023

Andhra Pradesh MLC Election 2023 : ఆంధ్రప్రదేశ్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించటంతో వైసీపీ షాక్ అయ్యింది. విజయానందంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తామే గెలుస్తామని ధీమాగా ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్న క్రమంలో ఇప్పటికే టీడీపీ, వైసీపీకి చెందిన 174మంది ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యే మాత్రం ఇంకా ఓటు వేయలేదు. ఈరోజు అసెంబ్లీలో ఓటు వేయాలని తెలిసినా కుమార్తె వివాహం వల్ల వైసీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు ఇంకా విజయవాడ చేరుకోలేదు. ఓటు వేయటానికి విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు.

ఈక్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా? లేదా టీడీపీ గెలుస్తుందా? అనే విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలవటం పెద్ద విషయం కాదని అంటూనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచినా పెద్ద విషయం ఏమీ కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ వైసీపీ మాత్రం తమ అభ్యర్ధులే గెలిచి తీరుతారని ధీమా వ్యక్తంచేస్తుంటే తోట మాత్రం ‘టీడీపీ గెలిచినా’ అంటూ వ్యాఖ్యానించటం పట్ల ఈ ఎన్నికల్లో కూడా టీడీపీ గెలుపు ఖాయమా? అన్నట్లుగా ఉన్నాయి.

ఇప్పటికే 174మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అంతా ఓట్లు వేశారు. మరోపక్క టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనని అటు టీడీపీ, ఇటు వైసీపీ ధీమా వ్యక్తంచేస్తున్నాయి.. కాగా..వైసీపీలో పైకి చెప్పుకోలేక ప్రభుత్వ విధానాలతో అసంతృప్తిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు తమకే ఓట్లు వేస్తారని టీడీపీ నమ్మకంగా చెబుతోంది. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ మాత్రం మేం ఇప్పుడు జాగ్రత్త పడ్డాం..మా ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా మాకే ఓటు వేస్తారని చెబుతోంది.

ఇప్పటికే వైసీపీపై రెబెల్ గా మారిన నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం తన ఓటు పక్కాగా టీడీపీకే వేస్తారనే ప్రచారం ఉంది. అలాగే మరో వైసీపీ ఎమ్మెల్యే ఆనం కూడా పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్న క్రమంలో ఆయన ఓటు కూడా వైసీపీకి పడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఈ ఇద్దరితో పాటు పైకి చెప్పుకోకుండా లోలోనే పార్టీ, ప్రభుత్వం వైఖరితో అసహనం వ్యక్తంచేసే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకే ఓటు వేస్తారని ప్రచారం జరుగుతోంది.

ఈక్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు టీడీపీ గెలిచినా అంటూ వ్యాఖ్యానించటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంటే వైసీపీలో పలువురు నేతలకు ఇదే అనుమానం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోపక్క అసెంబ్లీలో ఓటు వేయాల్సి ఉందని తెలిసినా  వైసీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు ఆలస్యంగా రావటంతో పోలింగ్ ఆలస్యమైంది. అప్పలనాయుడు ఓటుతో పోలింగ్ ముగియనుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పూర్తి అయ్యాక సాయంత్రం ఐదు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మరి ఈ కోటాలో గెలుపు ఎవరిది? అనేది తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. కాగా టీడీపీకి రాజీనామా చేసి తోట త్రిమూర్తులు 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరారు.14 జూన్ 2021లో వైసీపీ ఎమ్మెల్సీగా నియమితుడయ్యాడు.