Auto Catches Fire In AP : ఆటో ప్రమాదం పాపం ‘ఉడుత’దే..మా తప్పేమీ లేదు : ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ

ఏపీలోని సత్యసాయి జిల్లాలోని ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడి ఐదుగురు మహిళలు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదానికి కారణం ఓ ‘ఉడుత’ అని దీంట్లో తమ తప్పేమీ లేదని ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు చెప్పుకొచ్చారు. అధికారుల వింత సమాధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Auto Catches Fire In AP : ఆటో ప్రమాదం పాపం ‘ఉడుత’దే..మా తప్పేమీ లేదు : ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ

Auto Catches Fire (1)

Auto Catches Fire In AP : ఏపీలోని సత్యసాయి జిల్లాలోని గురువారం ఉదయం (602022) తాడిమర్రి మండలం, చిల్లకొండయ్యపల్లి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడటంతో, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మహిళలు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. చిల్లకొండయ్యపల్లి వద్ద ఈ ప్రమాదానికి కారణం ఓ ‘ఉడుత’ అని దీంట్లో తమ తప్పేమీ లేదని ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు చెప్పుకొచ్చారు. విద్యుత్ స్థంభంపై ఉన్న ఉడుత వైర్లు కొరకటంతో ఆటోమీద ఉన్న ఇనుప స్టాండ్ పై ఆ వైర్లు పడి షార్ట్ సర్యూట్ అవ్వటం వల్ల ఈ ఆటో ప్రమాదం జరిగిందని హరనాథరావు చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదం విచారణపై విజినెన్స్, సాంకేతిక కమిటీతో విచారణ జరిపిస్తామని తెలిపారు.

Also read : Auto Catches Fire: ఆటోపై విద్యుత్ తీగలు పడి.. ఐదుగురు సజీవ దహనం

కాగా ..ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు సమాధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేతికి అందేంత ఎత్తులో విద్యుత్ హై టెన్షన్ వైర్లు ఉన్నా పట్టించుకోకటం..పైగా ఇటువంటి తలతిక్క సమాధానాలు చెప్పి తప్పును కప్పిపుచ్చుకుంటారా? అనే విమర్శలు వస్తున్నాయి. విద్యుత్ వైర్లు ఉడత కొరికేంత బలహీనంగా ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు? చేతికి అందేంత ఎత్తులో హైటెన్షన్ వైర్లు ఉంటే అధికారుల కళ్లకు అవి కనిపించటంలేదా? అని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడటంతో, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మహిళలు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. గుండంపల్లికి చెందిన మహిళలు వ్యవసాయ పనుల కోసం ఆటోలో చిల్లకొండపల్లి బయలుదేరారు. మార్గమధ్యలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. సామాన్లు పెట్టుకోవడానికి ఆటోపై ఇనుప స్టాండ్ ఏర్పాటు చేశారు.ఈ స్టాండుకు హై టెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో కరెంట్ షాక్ తగిలి, ఆటోకు నిప్పు అంటుకుంది. దీంతో ఆటోలో ఉన్న ఐదుగురు మహిళలు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.

Also read : CM JAGAN: ఆటో ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. పది లక్షల పరిహారం ప్రకటన

ఆటో ప్రమాద ఘటనపై సీఎం వై.ఎస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.